Begin typing your search above and press return to search.

మెగా154 : మాస్ బ్లాస్ట్‌ కి చిన్న హింట్‌

By:  Tupaki Desk   |   23 Oct 2022 5:47 AM GMT
మెగా154 : మాస్ బ్లాస్ట్‌ కి చిన్న హింట్‌
X
మెగాస్టార్ చిరంజీవి.. బాబీ కాంబోలో రూపొందిన సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ మెగా 154 సినిమా టైటిల్‌ ను దీపావళి సందర్భంగా రివీల్‌ చేయబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈనెల 24వ తారీకున మాస్ బ్లాస్ట్‌ కి యూనిట్‌ సభ్యులు రెడీ అయ్యారు.

అందుకు ఒక రోజు ముందే అంటే నేడు ఆ బ్లాస్ట్‌ కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ ను విడుదల చేశారు. ఏ స్థాయిలో చిరంజీవి యొక్క మాస్ లుక్ ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. చేతిలో సిగర్ చెవికి కమ్మ చూస్తూ ఉంటే బాస్ ఏ స్థాయిలో మాస్ గా ఉంటాడో ఊహించుకోవచ్చు అంటూ మెగా ఫ్యాన్స్ ఆనందించేలా తాజా వీడియో ఉంది.

రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మెగా ఫ్యాన్స్ అందరికీ అదిరి పోయే దీపావళి గిఫ్ట్ అన్నట్లుగా మెగా 154 సినిమా యొక్క వీడియో రావడంతో పాటు టైటిల్ ను రివీల్‌ చేయబోతున్నారు. అద్భుతమైన మాస్‌ రోల్‌ లో చిరంజీవిని దర్శకుడు బాబీ చూపించాడని ఇప్పటికే యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

టైటిల్‌ ను మొన్నటి వరకు వాల్తేరు వీరన్న అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టైటిల్ ను మార్చారని.. కొత్త టైటిల్ మరింత మాస్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా లో మాస్ రాజా రవితేజ నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క దీపావళి సర్‌ ప్రైజ్ సినిమా పై అంచనాలు భారీగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాడ్ ఫాదర్ తర్వాత మరో బ్లాక్‌ బస్టర్ చిరు ఖాతాలో పడబోతుందని మెగా ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.