Begin typing your search above and press return to search.
100 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లతో మెగా యజ్ఞం మొదలు
By: Tupaki Desk | 25 May 2021 7:15 PM ISTకరోనా కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి సీసీసీని ప్రారంభించి సినీకార్మికులను కొంతవరకూ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల వ్యాక్సినేషన్ ప్లాస్మా దానం పై ప్రచారం సాగించారు. ఆపదలో ఉన్న ఆర్టిస్టులు అభిమానులకు లక్షల్లో విరాళాల్ని డొనేట్ చేశారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం నాడు కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ కార్యక్రమాన్ని మెగాస్టార్ స్వయంగా ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లు/ కాన్ సన్ ట్రేటర్లు యుద్దప్రాతిపదికన అన్ని జిల్లాలకు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఇటీవల కరోనా మరణాలు మెగాస్టార్ ను కదిలించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించుకుని తన ఆలోచనకు కుమారుడు రామ్ చరణ్ తోనూ పంచుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. మెగా అభిమానులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేయబోతున్నారు. ఆయా జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షులు అక్కడ వీటి నిర్వహణ బాధ్యత చూస్తారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించినట్లు వివరించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ -``ఈరోజు నుంచి 100 సిలిండర్లతో యజ్ఞం ప్రారంభించాం. ఇక నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుంది. వీలున్నంతవరకూ ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్లు ప్రొక్యూర్ చేస్తున్నాం. ప్రస్తుతం విపరీతమైన స్కార్సిటీ నెలకొంది. ఇంకొన్నిటికి ఆర్డర్ ఇచ్చాం. ఎక్కడ అవసరం ఉంది? ఎక్కడ డిమాండ్ ఉంది? అన్న ప్రాతిపదికన ఆక్సిజన్ అందిస్తున్నాం. డిమాండ్ అధికంగా ఉండడం వల్ల ఆశించినంతగా అందించడం కష్టతరంగా ఉంది. అందుకే స్థానికంగానే ప్రతి జిల్లాలో ప్రొక్యూర్ చేసి అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రారంభం ఎక్కువ ఇబ్బంది ఉన్న అనంతరపురం గుంటూరు శ్రీకాకుళం జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నాం. ఇకపై అన్ని జిల్లాలకు అవసరం ఉన్న అన్నిచోట్లకు పంపిణీ చేస్తాం. అలాగే ప్రతిచోటా ఆక్సిజన్ మిస్ యూజ్ కాకుండా ట్రాకింగ్ పరికరాన్ని కూడా టెక్నీషియన్లు ఏర్పాటు చేస్తున్నారు. సిలిండర్ల రీఫిల్లింగ్ కూడా కంపెనీలతో టై అప్ అయ్యి పని చేస్తాం. అన్నిచోట్లా ఇది సద్వినియోగం కావాలనే మా ప్రయత్నం. ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్లను ప్రొక్యూర్ చేసేందుకు రామ్ చరణ్ కూడా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. చరణ్ ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. అన్నివిధాలా దీనిని యుద్ధ ప్రాతిపదికన యజ్ఞంలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. విపరీతమైన డిమాండ్ వల్ల కొరత కారణంగా కొంత ఇబ్బంది ఎదురవుతోంది. ఇక స్థానికంగా అభిమాన సంఘాలు ఈ ప్రాసెస్ లో సహకరిస్తున్నాయి`` అని అన్నారు.