Begin typing your search above and press return to search.

మెగా 'గని'కి మెగా వాయిస్‌!

By:  Tupaki Desk   |   15 Nov 2021 4:01 AM GMT
మెగా గనికి మెగా వాయిస్‌!
X
మెగా హీరో వరుణ్‌ తేజ్ నటించిన గని సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. నేడు ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతుంది. సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. సిద్దు ముద్దతో కలిసి అల్లు బాబీ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో చక్కని ఎమోషనల్‌ స్టోరీతో ఈ సినిమాను రూపొందించినట్లుగా చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ నుండి అల్లు బాబీ ఈ సినిమా తో మొదటి సారి నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు. కనుక మెగా ఫ్యామిలీ నుండి చాలా సపోర్ట్‌ కనిపిస్తుంది. చిరంజీవి ఫ్యామిలీకి చెందిన పలువురు హీరోలు ఇతరులు కూడా ఈ సినిమా కు వెన్ను దన్నుగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అల్లు వారి అయాన్ పెదనాన్న సినిమా కోసం ప్రమోషనల్ వీడియోను చేయడం జరిగింది. ఇప్పుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ట్రైలర్ కు వాయిస్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

గని సినిమా ట్రైలర్ రామ్‌ చరణ్ వాయిస్ ఓవర్‌ తో సాగుతుందని అంటున్నారు. ట్రైలర్ మరింత పవర్‌ ఫుల్‌ గా మార్చేందుకు చరణ్ వాయిస్ ఉపయోగపడింది అంటూ మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కనిపించినా.. వినిపించినా కూడా అభిమానులకు పూనకాలు ఖాయం. కనుక గని సినిమా ట్రైలర్ కు మెగా అల్లూరి సీతారామ రాజు వాయిస్ అదనపు ఆకర్షణగా నిలిచి జనాల్లోకి గనిని మరింతగా తీసుకు వెళ్లడంలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. రామ్ చరణ్‌ ట్రైలర్ లో చెప్పే డైలాగ్స్ చాలా పవర్‌ ఫుల్ గా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. హీరో గని పాత్రను పరిచయం చేయడంతో పాటు ఇతర పాత్రలతో అతడికి ఉన్న సంబంధంను వివరిస్తూ రామ్‌ చరణ్ వాయిస్ ఓవర్‌ ఉంటుందని చెబుతున్నారు.

కేవలం ట్రైలర్ లో మాత్రమే కాకుండా సినిమాలో కూడా రామ్‌ చరణ్ వాయిస్ ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత అయితే లేదు కాని మొదట అయితే మరి కాసేపట్లో రాబోతున్న ట్రైలర్ లో మాత్రం చరణ్‌ వినిపించబోతున్నాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు అంటూ మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది. గని ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్నారు. నేడు ఉదయం 11.08 గంటలకు ట్రైలర్ విడుదల కాబోతుండగా.. సినిమాను డిసెంబర్‌ 3న విడుదల చేయబోతున్నారు.

విడుదల మరో మూడు వారాలు ఉండగానే సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయడం చూస్తుంటే ముందు ముందు భారీ ప్రమోషనల్‌ ఈవెంట్స్ ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది అంటూ మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్‌ మరియు మెగా ఫ్యామిలీకి చెందిన మరి కొందరు హీరోలు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా కన్నడ స్టార్‌ ఉపేంద్ర మరియు బాలీవుడ్‌ స్టార్‌ సునీల్ శెట్టిలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్స్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందిన విషయం తెల్సిందే.