Begin typing your search above and press return to search.
కీరవాణి తనయుడి కోసం మెగా సపోర్ట్
By: Tupaki Desk | 28 Jun 2023 6:32 PM ISTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన గొప్ప లక్షణం. ఆయన్ను చూసే ఎంతో మంది స్ఫూర్తి చెంది సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. అలాగే చిరు కూడా ఎంతో మంది నటీనటులను, టెక్నీషియన్స్ ను ప్రోత్సహిస్తూనే ఉంటారు. అప్ కమింగ్ హీరోస్, డైరెక్టర్స్ చేసే కొత్త సినిమాలకు విషెస్ తెలుపుతూ, వారి ప్రమోషన్ ఈవెంట్లకు హాజరై వారిలో ఉత్సాహన్ని నింపుతారు.
తాజాగా భాగ్ సాలే టీమ్ కు మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ విషెస్ తెలిపారు. శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన కొత్త సినిమానే భాగ్ సాలే. నేహా సోలంకి హీరోయిన్ గా నటించింది. జూలై 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి... సినిమా ట్రైలర్ చూసి బాగుందని ప్రశంసించారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. భాగ్ సాలే సినిమా ట్రైలర్ బాగుంది. శ్రీసింహా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుకుంటున్నాడు. కామెడీ, మాస్, ఎంటర్ టైనింగ్ తో పాటు క్రైమ్ నేపథ్యం సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. శ్రీసింహా.. కీరవాణి గారి అబ్బాయి అని అతను హీరోగా పేరు తెచ్చుకునే వరకు నాకు తెలియదు. వారసుడిగా కాకుండా తను స్వతహాగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు.
కీరవాణి గారికి పేరు తెచ్చేంతగా గుర్తింపు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే కాలభైరవ అంటే చరణ్ కు చాలా ఇష్టం. ఇకపైనా కూడా వీరు మంచి అవకాశాలతో తమ ప్రతిభను చాటుకోవాలి. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండంగా ఈ సినిమాను రూపొందించారు. అలాగే నిర్మాత అర్జున్ దాస్యన్ మంచి ప్రయత్నం చేశారు. ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
భాగ్ సాలే సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల సంయుక్తంగా నిర్మించారు. సోలంకి కథానాయిక. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా రూపొందింది.