Begin typing your search above and press return to search.

మెగాస్టార్ వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తున్నాడా...?

By:  Tupaki Desk   |   23 April 2020 10:15 AM IST
మెగాస్టార్ వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తున్నాడా...?
X
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయం ఇచ్చిన ఊపుతో ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ తర్వాత మరో ముగ్గురు యంగ్ డైరెక్టర్లతో సినిమాలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. యంగ్ డైరెక్టర్స్ సుజిత్.. బాబీ.. మెహార్ రమేశ్‌ లతో సినిమాలు చేయబోతున్నాని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కాగా మెగాస్టార్ చిరంజీవి ఒక షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నాడట. అదేంటంటే చిరు ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగులోనూ వెబ్ సిరీస్‌ లకు కూడా క్రేజ్ బాగా పెరుగుతోంది. లాక్‌ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనాలు సినిమాల కంటే వెబ్ సిరీస్‌లను వీక్షించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థం అవుతోంది. దీంతో స్టార్ హీరోలను వెబ్ సిరీస్‌ లలో నటింపచేసి వాటికి మరింత క్రేజ్ తేవాలని ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్ ప్రయత్నిస్తున్నాయి.

బాలీవుడ్ లో ఇప్పటికే పెద్ద పెద్ద స్టార్ హీరోలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తున్నారు. మన తెలుగు వెబ్ సిరీస్ లలో ఇప్పటికే శ్రీకాంత్, జగపతిబాబు, సందీప్ కిషన్, అల్లు శిరీష్ లాంటి మీడియం రేంజ్ హీరోలు వెబ్ సిరీస్‌ లలో నటించారు. ఇప్పుడు తాజాగా ఓ టాప్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నుంచి మెగాస్టార్‌ కు కాల్ వచ్చిందట. వారి ఆఫర్‌ కు సానుకూలంగా స్పందించిన చిరూ ‘డైరెక్టర్‌ ను పంపించండి... కథను వింటానని’ చెప్పారట. మంచి క్రేజీ కథలతో వచ్చే యంగ్ దర్శకులను తన వద్దకు తీసుకురమ్మని మేనేజర్‌ కు ప్రత్యేకంగా చెప్పారట. దీంతో మెగాస్టార్ త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. ఇదే కనుక నిజమైతే చిరంజీవి లాంటి టాప్ స్టార్ ఎంట్రీ ఇస్తే తెలుగులోనూ వెబ్ సిరీస్‌ హవా మొదలవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే మెగా బావమరిది అల్లు అరవింద్‌ ‘ఆహా’ పేరు ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే క్రేజ్ సంపాదించుకుంటున్న ‘ఆహా’కు క్రేజ్ తేవడం కోసం చిరూ ఈ డేరింగ్ స్టెప్ తీసుకుంటాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా వినిపిస్తోంది.