Begin typing your search above and press return to search.

మళ్లీ పింక్ ఎలిఫెంట్‌ తో రాబోతున్న మెగా ప్రిన్సెస్‌

By:  Tupaki Desk   |   24 Dec 2020 1:00 PM IST
మళ్లీ పింక్ ఎలిఫెంట్‌ తో రాబోతున్న మెగా ప్రిన్సెస్‌
X
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న మాదిరిగా మెగా ప్రిన్సెస్‌ అంటూ పేరు దక్కించుకున్న నిహారిక కొణిదెల కూడా మల్టీ ట్యాలెంటెడ్‌ అంటూ ఇండస్ట్రీలో అందరితో అనిపించుకుంది. యాంకరింగ్‌ నుండి నిర్మాణం వరకు అనేక రంగాల్లో నిహారిక తన వేలు ఉంచింది. హీరోయిన్‌ అవ్వాలనేది ఆమె డ్రీమ్. ఆ డ్రీమ్ అయితే నిజం అయ్యింది కాని కమర్షియల్‌ సక్సెస్‌ లు కాలేక పోయింది. పెళ్లి చేసుకున్న నిహారిక ఇక సినిమాల్లో హీరోయిన్‌ గా నటించే అవకాశం కనిపించడం లేదు. ఆమె భర్త చైతన్య ను హీరోగా పరిచయం చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సమయంలో నిహారిక మళ్లీ ప్రొడక్షన్‌ హౌస్‌ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుందట.

నిహారిక ఇప్పటికే పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ లో ముద్దపప్పు ఆవకాయ్‌.. నాన్న కుచ్చి.. మ్యాడ్‌ హౌస్‌ అనే వెబ్‌ సిరీస్ లను నిర్మించింది. ఇకపై తన పింక్‌ ఎలిఫెంట్‌ ను మరింతగా యాక్టివ్‌ చేసి చిన్న సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లను వరుసగా నిర్మించాలని భావిస్తుందట. అందుకోసం పది మంది టీంను ఆఫీస్ ను కూడా నిహారిక దంపతులు ఏర్పాటు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తక్కువ ఖర్చుతో వెబ్‌ సిరీస్ లు సినిమాలు తీస్తే ఈ మద్య డబుల్ ప్రాఫిట్‌ లు వస్తున్న దాఖలాలు ఉన్నాయి. అందుకే నిహారిక నిర్మాతగా బిజీ అవ్వాలనుకుంటున్నట్లుగా మెగా కాంపౌండ్‌ నుండి సమాచారం అందుతోంది. ఇటీవలే చిరంజీవి పెద్దమ్మాయి సుష్మిత కూడా నిర్మాతగా మారి షూట్‌ ఔట్‌ వెబ్ సిరీస్ ను నిర్మించిన విషయం తెల్సిందే.