Begin typing your search above and press return to search.

కొరటాలకు కాల్ షీట్స్ ఇచ్చిన మెగా పవర్ స్టార్

By:  Tupaki Desk   |   13 Jan 2020 11:00 PM IST
కొరటాలకు కాల్ షీట్స్ ఇచ్చిన మెగా పవర్ స్టార్
X
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ఇప్పటికే ప్రారంభం అయింది. కొరటాల గత చిత్రాల స్టైల్ లోనే ఈ సినిమా కూడా బలమైన కథతో మెగాస్టార్ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతుందని అంటున్నారు. ఈ సినిమాకు రామ్ చరణ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా చరణ్ నటుడిగా కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్ర గురించి తాజాగా కొంత సమాచారం బయటకు వచ్చింది.

ఈ సినిమాలో నటించేందుకు చరణ్ ఇప్పటికే రెడీ అయ్యారని.. ఒకటిన్నర నెల కాల్షీట్స్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. చరణ్ పాత్ర గురించి ఎక్కువ వివరాలు తెలియవు కానీ ఈ సినిమాలో యువకుడైన చిరంజీవిగా చరణ్ కనిపిస్తారట. అయితే 'RRR' పూర్తయిన తర్వాతే చరణ్ ఈ సినిమాకు కాల్ షీట్స్ ఇస్తారట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. యంగ్ చిరు రోల్ లో నటిస్తున్న చరణ్ తో కూడా ఒక హీరోయిన్ ట్రాక్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

వందశాతం విజయాలు సాధించిన దర్శకుడు కొరటాల శివ..మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అటు ట్రేడ్ వర్గాల్లోనూ.. ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు కాబట్టి ఈ సినిమా పై ఆకాశాన్ని తాకే క్రేజ్ ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కొరటాల మెగాస్టార్ ను మెగా పవర్ స్టార్ ను ఎలా ప్రెజెంట్ చేస్తారో వేచి చూడాలి.