Begin typing your search above and press return to search.
రామ్ చరణ్ రౌడీ అల్లుడు గెటప్!
By: Tupaki Desk | 10 Jun 2022 12:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `రౌడీ అల్లుడు` బ్లాక్ బస్టర్ గురించి చె ప్పాల్సిన పనిలేదు. అందులో చిరు ద్విపాత్రాభినయం ఇప్పటికీ ఓ సంచలనమే. ఒకటి సాప్ట్ పాత్ర అయితే..మరొకటి రప్ఫాడించే మాస్ పాత్రలో చిరు ప్రేక్షకుల్ని మెప్పించిన వైనం ఎప్పటికీ ట్రెండ్ సెట్టరే. మాస్ పాత్రలో చిరు ఆహార్యం ఆకట్టుకుంటుంది.
అందులో చిరు గడ్డం..మీసకట్టు ..హెయిర్ స్టైల్ ..మ్యానరీజమ్ ఆ పాత్రకు పర్పెక్ట్ గా యాప్ట్ అయ్యాయి. చిరు షార్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. సరిగ్గా చరణ్ ని ఇక్కడ చూస్తే జూనియర్ రౌడీ అల్లుడు లా అనిపించలేదు. పెరిగిన హెయిర్..గడ్డం..మీస కట్టు ఆహార్యంలో అచ్చంగా డాడ్ లుక్ నే తలపిస్తున్నాడు.
బ్లాక్ కలర్ క్యాజువల్ ప్యాంట్.. వైంట్ అండ్ రెడ్ మ్యాచింగ్ షర్ట్ ..వైట్ కలర్ షూస్..షార్ట్ లుక్ లో రౌడీ అల్లుడికే బాప్ లా కనిపిస్తున్నాడు. ఆ పక్కనే భార్య ఉపాసన ఉన్నారు. ఇద్దరు జంటగా వెకేషన్ కి వెళ్తూ ఇలా ఎయిర్ పోర్ట్ లో కెమెరాకి.. ఆ తర్వాత తుపాకీకి చిక్కారిలా. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది.
ఇటీవలి కాలంలో చరణ్ సతీసమేతంగా కనిపించడం ఇది రెండవసారి. `ఆర్ ఆర్ ఆర్` సినిమా రిలీజ్ అనంతరం వారం పది రోజులు వెకేషన్ కి వెళ్లొచ్చారు. ఆ తర్వాత చరణ్ శంకర్ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు. మళ్లీ `ఆచార్య` ప్రమోషన్ లో బిజీ అయ్యారు. ఆ సినిమా రిలీజ్ అనంతరం చరణ్ ఎలాంటి వెకేషన్ ప్లాన్ చేయలేదు.
వెంటనే మళ్లీ ఆర్ సీ 15 షూట్ లో తలమునకలయ్యారు. మళ్లీ విరామం దొరకడంతో ఇప్పుడిలా టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ సీ 15 కొంత భాగం షూటింగ్ పూర్తయింది. చరణ్-కియారా అద్వాణీ..ఎస్.జె సూర్య సహా కీలక నటీనటులపై శంకర్ ఆధ్వర్యంలో సన్నివేశాలు చిత్రీకరించారు. హైదరాబాద్.. వైజాగ్..రాజమండ్రిలో షూటింగ్ జరిగింది.
బ్యాలెన్స్ సహా పో స్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా అనంతరం చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇప్పటికే స్ర్కిప్ట్ లాక్ అయింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరిలో తెరకెక్కించనున్నట్లు ప్రచారం సాగుతోంది. `ఆర్ ఆర్ ఆర్` తో చరణ్ పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే.