Begin typing your search above and press return to search.
మెగా సెన్సేషనల్ కాంబోలో యాక్షన్ ప్రాంఛైజీకి బీజం పడుతోందా..?
By: Tupaki Desk | 26 Nov 2021 5:00 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ లో ఇప్పుడు నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే రెండు సినిమాల షూటింగులు పూర్తి చేయడమే కాకుండా.. మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు.
మరో మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే కొరటాల శివ - రాజమౌళి - శంకర్ - గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకులతో సినిమాలు చేస్తున్న చెర్రీ.. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను లైన్ లో పెట్టారని టాక్ వినిపిస్తోంది.
'కేజీయఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.. శాండిల్ వుడ్ లో కంటే టాలీవుడ్ మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ తో 'సలార్' సినిమా చేస్తున్న నీల్.. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఓ భారీ ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు. ఇక రామ్ చరణ్ తో ఎప్పటి నుంచో ఓ సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇటీవల చిరంజీవి - రామ్ చరణ్ - నిర్మాత డీవీవీ దానయ్యలతో ప్రశాంత్ నీల్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా హల్ చల్ చేశాయి. దీంతో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చిరు లేదా చెర్రీతో కేజీయఫ్ దర్శకుడి సినిమా ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇద్దరిలో ఎవరితో అయినా ఓకే అని మెగా అభిమానులు ఖుషీ అయ్యారు.
అయితే తాజాగా బాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రామ్ చరణ్ - ప్రశాంత్ నీల్ మధ్య స్టోరీ డిస్కసన్స్ మొదలయ్యాయట. ఇందులో ప్రశాంత్ చెప్పిన రెండు స్టోరీ లైన్స్ చెర్రీ కి నచ్చాయని అంటున్నారు.
అందులో ఒకటి యాక్షన్ స్టోరీ అని.. అది కూడా ఫ్రాంఛైజీ లాగా చేయడానికి అవకాశమున్న కథ అని.. చరణ్ సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ వచ్చిందని కథనాలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే చరణ్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ జత చేరినట్లే.
హీరోయిజం చూపించడంలో ఎలివేషన్స్ ఇవ్వడంలో ప్రశాంత్ నీల్ దిట్ట. 'ఉగ్రమ్' 'కేజీఎఫ్' సినిమాలతో తనెంతో ఆడియన్స్ కు చూపించారు. మరోవైపు సౌత్ లోని మాస్ హీరోల్లో ఒకరు చరణ్. వీరిద్దరూ కలిసి ఓ యాక్షన్ మూవీ చేస్తే అది ఆ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
అందులోనూ 'ఆర్.ఆర్.ఆర్' 'RC15' సినిమాలతో చెర్రీ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంటాడనడంలో సందేహం లేదు. దీనికి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా కలిస్తే మెగా వారసుడి ఇమేజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందని చెప్పవచ్చు. త్వరలోనే ఈ మెగా సెన్సేషనల్ కాంబోకి బీజం పడుతుందేమో చూడాలి.