Begin typing your search above and press return to search.

రామరాజు బర్త్‌ డే సందడే సందడి

By:  Tupaki Desk   |   23 March 2021 4:03 AM GMT
రామరాజు బర్త్‌ డే సందడే సందడి
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ పుట్టిన రోజు మార్చి 27. గత ఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా అభిమానుల సందడి కనిపించలేదు. కాని ఆయన నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నుండి ఫస్ట్‌ లుక్ ను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ఏడాది అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పుట్టిన రోజుకు ముందు రోజు అంటే మార్చి 26వ తారీకున శిల్పకళా వేదికలో పెద్ద ఎత్తున అభిమానులు వేడుకకు సిద్దం అవుతున్నారు. ఈ అభిమానుల వేడుకలో మెగా ఫ్యామిలీ నుండి పలువురు హీరోలు హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అభిమాన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న బర్త్‌ డే వేడుకల్లో పెద్ద అభిమానులు హాజరు అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

చరణ్‌ పుట్టిన రోజు సందర్బంగా ఆర్ఆర్ఆర్‌ చిత్రం నుండి రామరాజు మరో స్పెషల్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇదే సమయంలో మగధీర సినిమా ను ప్రసాద్స్‌ లో ప్రత్యేక షో వేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక చరణ్ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెల రోజులుగా చరణ్ పుట్టిన రోజు నేపథ్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 27న వాటి ముగింపు ఉంటుందని అభిమాన సంఘాలు చెప్పుకొచ్చాయి. మొత్తానికి చరణ్‌ బర్త్‌ డే వేడుకలు సందడే సందడి అన్నట్లుగా సాగుతుందని అభిమానులు భావిస్తున్నారు.