Begin typing your search above and press return to search.

ఆందోళనలో మెగామూవీ మేకర్స్.. ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   6 April 2021 5:30 PM GMT
ఆందోళనలో మెగామూవీ మేకర్స్.. ఎందుకంటే..?
X
ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా సినీ ఇండస్ట్రీలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్యతో సహా షూటింగ్ దశలో ఉన్నటువంటి అన్ని సినిమాలకు పరిస్థితులు అనుకూలంగా లేవని స్పష్టంగా ఏర్పడుతుంది. తాజా సమాచారం ప్రకారం.. ఆచార్య చిత్రానికి కీలకమైన వర్క్ ఇంకా మిగిలి ఉందట. కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో చిత్రనిర్మాతలలో తీవ్రమైన ఆందోళన నెలకొందట. నిజానికి ఆచార్య షూట్ మాత్రమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ కోసం కూడా తగినంత సమయం కావాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ పీరియడ్ పార్ట్ కొరకు హై-ఎండ్ విఎఫ్ఎక్స్ అవసరమట.

ఆచార్య సినిమాను మే 13న విడుదల చేయనునట్లు మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అలా ప్రకటించడమే ఇప్పుడు చిత్రయూనిట్ కు సవాల్ అయింది. ఎందుకంటే ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్‌లో సినిమాను సకాలంలో బ్యాలెన్స్ షూట్‌ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అనుకున్న టైంలో ఫినిష్ చేయాలంటే కొరటాల బృందానికి పెద్దపరీక్షే అని చెప్పాలి. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం గతవారం విడుదలైన వైల్డ్ డాగ్, సుల్తాన్ సినిమాల విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. వైల్డ్ డాగ్‌ తో పాటు ఆచార్య మూవీని కూడా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ప్రభావం పడటంతో ఆచార్య విడుదల తేదీ మేకర్స్ లో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అలాగే మరో లాక్డౌన్ పుకార్లు కూడా వినిపిస్తుండటంతో నిర్మాతలకు టెన్షన్ మొదలైందని టాక్. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో!