Begin typing your search above and press return to search.

మెగా హీరో స‌ర‌స‌న కేజీఎఫ్ బ్యూటీ జాక్ పాట్?

By:  Tupaki Desk   |   21 Feb 2021 6:00 PM IST
మెగా హీరో స‌ర‌స‌న కేజీఎఫ్ బ్యూటీ జాక్ పాట్?
X
కేజీఎఫ్ బ్యూటీ నిధి శెట్టి టాలీవుడ్ వైపు చూస్తోందా? ఇక్క‌డ మెగా హీరోల స‌ర‌స‌న న‌టించే అరుదైన అవ‌కాశం ద‌క్కించుకుందా? అంటే అవున‌నే ఇండ‌స్ట్రీ ఇన్ సైడ్ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

చిక్లెట్ క‌ళ్ల‌తో రాఖీ భాయ్ గుండెల్ని కొల్ల‌గొట్టిన నిధి శెట్టి అంద‌చందాలు మ‌త్తెక్కించే య‌వ్వ‌నం తెలుగు కుర్ర‌కారుకు కంటిపై కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చింది. అందుకే ఈ బ్యూటీని టాలీవుడ్ లోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ట‌.

ఓ అప్ క‌మింగ్ క్రేజీ మెగా మూవీలో తీసుకోవ‌డానికి స‌ద‌రు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. వివ‌రాల్లోకి వెళితే ఆ ప్రాజెక్ట్ గురించి ప‌ర్ ఫెక్ట్ గా తెలియ‌దు కానీ రామ్ చ‌ర‌ణ్ లేదా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసే సినిమాల్లోకి ఈ బ్యూటీని ఎంపిక చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. నిధి శెట్టికి కేజీఎఫ్ వ‌ల్ల ఏమంత క‌లిసి రాక‌పోయినా.. ఇన్నాళ్టికి ఒక పెద్ద ఆఫ‌ర్ త‌గుల్తోంది అంటే.. మ్యాట‌ర్ ఉండ‌బ‌ట్టే. మెగా హీరో స‌ర‌స‌న ఆఫ‌ర్ అంటే క‌చ్ఛితంగా ప‌ర్ఫెక్ట్ లాంచ్ ద‌క్కుతున్న‌ట్టే. చాలా రోజులుగా స‌రైన అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్న ఈ క‌న్న‌డ పాప తెలుగునాట ఎలా రాణిస్తుందో చూడాలి.