Begin typing your search above and press return to search.

భర్తతో మెగా హీరోయిన్ సెల్ఫీ..!

By:  Tupaki Desk   |   1 May 2021 4:23 PM IST
భర్తతో మెగా హీరోయిన్ సెల్ఫీ..!
X
సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం కరోనా కారణంగా భర్త గౌతమ్ కిచ్లుతో ఇంటి పట్టునే ఉంటోంది. అమ్మడు పెళ్లి అయినప్పటి నుండి పెద్దగా బయట కనిపించడం లేదు. కేవలం సినిమా షూటింగ్స్, ఇల్లు మాత్రమే లోకం అయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు ప్రతి దానికి అమ్మడు సోషల్ మీడియాలో కనిపించేది. కానీ ఇప్పుడు పెళ్లి జరిగింది కదా.. ఓ వివాహ బాంధవ్యంలో అడుగుపెట్టింది. కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు భర్తతో కూడా తగిన సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. గతేడాది లాక్డౌన్ సమయంలో కాజల్ - గౌతమ్ పెళ్లితో ఒక్కటయ్యారు. నిజంగా కాజల్ అభిమానులకు పెళ్లి వార్త పెద్దచేదు వార్తే అని చెప్పాలి.

కానీ ఆనందించాల్సిన విషయం ఏంటంటే.. కాజల్ పెళ్లి తర్వాత సినిమాలకు సెలవు పెట్టలేదు. కానీ ఇదివకటిలా అందాల ఆరబోత మాత్రం చేయకపోవచ్చు. ఎందుకంటే పెళ్లికి ముందు లైఫ్ లో ఎంతలా గ్లామర్ షో చేసినప్పటికి ఇప్పుడు లైఫ్ లోకి భర్త వచ్చాడు. కాబట్టి ఇకపై గ్లామర్ షో కనిపించదు కాబోలు. కానీ ఈ విషయంలో ఆమె భర్తకు అభ్యంతరం లేకపోతే మాత్రం అమ్మడు మళ్లీ అందాలతో అదరగొట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కరోనా టైం నడుస్తుంది కాబట్టి.. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండట్లేదు కాజల్. తాజాగా భర్తతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో భర్త గౌతమ్ తో పాటు కాజల్ మాస్కులు పెట్టుకొని ఉండటం మనం చూడవచ్చు. ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది.