Begin typing your search above and press return to search.
వివాదాల పై మెగా హీరోల మౌనమేల...?
By: Tupaki Desk | 30 Aug 2020 1:20 PM ISTటాలీవుడ్ లో ఇప్పుడు ''ఆచార్య'' ''పుష్ప'' సినిమాల స్టోరీలపై కాపీ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా స్టోరీ నాదేనంటూ ఇటీవల రాజేష్ మండూరి అనే వర్థమాన రచయిత మీడియా ముఖంగా ఆరోపించాడు. ఈ స్టోరీ నేను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు వినిపించానని.. ఇప్పుడు ఇదే స్టోరీతో కొరటాల శివ చిరంజీవితో సినిమా చేస్తున్నారని పేర్కొన్నాడు. అయితే వీటన్నిటిని ఖండిస్తూ 'ఆచార్య' నిర్మాతలు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ స్పందించి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన కథ దర్శకుడు కొరటాల శివ స్వయంగా రాసుకున్నారని.. ఆయన కాపీ కొట్టారని వస్తున్న వదంతులు అన్ని బేస్ లెస్ అని చెప్పారు.
ఇక కొరటాల శివ సైతం మీడియా ముఖంగా దీనిపై స్పందించారు. నా కథ వేరని.. సోషల్ ఇష్యూస్ పై ఎవరికి తోచిన విధంగా వారు కథలు రాసుకుంటూ ఉంటారని.. షూటింగ్ దశలో ఉన్న సినిమా స్టోరీ నేను చెప్పలేనని.. నాపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై అవసరమైతే కోర్టుకు కూడా వెళతానని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ ఇష్యూని చిరంజీవిగారి దగ్గరకు తీసుకెళ్లాలన్నది వారి ప్రయత్నం కావొచ్చు.. ఈ విషయాన్ని నేను చిరంజీవి దగ్గరకు తీసుకుపోతానని చెప్పుకొచ్చాడు. దీంతో మెగాస్టార్ ఏఈ ఇష్యూపై చొరవతీసుకుని పరిష్కారం చూపి ఫుల్ స్టాప్ పెట్టాలని అందరూ కోరుకున్నారు.
మరోవైపు అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాపై కూడా కాపీ ఆరోపణలు వచ్చాయి. సాహిత్య అకాడమీ యువ పురష్కార గ్రహీత డా. వేంపల్లి గంగాధర్ 'పుష్ప' సినిమా తాను రాసిన 'తమిళ కూలీ' కథ మరియు 'ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు' అనే పుస్తకం ఆధారంగా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ఇంతవరకు 'పుష్ప' దర్శకనిర్మాతలు కానీ హీరో కానీ దీనిపై స్పందించలేదు. రెండు సినిమాలు మెగా ఫ్యామిలీకి చెందినవి కావడం వల్ల చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ముందుకు వచ్చి ఈ వివాదాలకు పరిష్కారాలు చూపాలని సినీ అభిమానులు కోరుకున్నారు. ఈ వివాదాలపై నిజానిజాలు తెలియనప్పటికీ చిరంజీవి లాంటి స్టార్ హీరో స్పందిస్తే వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం పెద్దది కాకముందే పరిష్కారం దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.