Begin typing your search above and press return to search.

కామెంట్: ఇది మెగా మిస్టేక్‌ అవ్వొచ్చు

By:  Tupaki Desk   |   8 Dec 2015 11:00 PM IST
కామెంట్: ఇది మెగా మిస్టేక్‌ అవ్వొచ్చు
X
నిన్నటి లోఫర్‌ సినిమా ఆడియో లాంచ్‌ లో అస్సలు మెగా హీరో అనేవారు ఎవ్వరూ రాలేదు. మెగాబ్రదర్‌ నాగబాబు - ఆయన తనయుడు వరుణ్‌ తేజ్‌ తప్పిస్తే.. అస్సలు ఒక్కరంటే ఒక్క మెగా హీరో కూడా రాలేదు. దీనికి వరుణ్‌ తేజ్‌ మాట్టాడుతూ క్రికెట్‌ టీమ్‌ అంత సైజులో ఉన్న మా ఫ్యామిలీ హీరోలు అన్ని పండుగలకు రావడం ఎందుకులే అని మేమే అపేశాం అంటున్నాడు.

వరుణ్‌ చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నప్పటికీ అసలు మనోడు ఒక విషయం గ్రహించలేదు. మెగా హీరోలు అనేవారు మెగా ఫంక్షన్లకు రాకపోతే.. కారణాలు ఎన్ని చెప్పినా కూడా బయటకు రాంగ్‌ సిగ్నల్స్‌ వెళ్ళక మానవు. ఒకవేళ పూరి జగన్‌ తో కోపంగా ఉండటంతో ఈ ఈవెంటుకు రాలేదా? లేకపోతే వరుణ్‌ చెల్లెలు నిహారిక కొణిదెల హీరోయిన్‌ అవుతోంది కాబట్టి కోపమొచ్చి వీళ్లందరూ రాలేదా? అనే డిస్కషన్లు ఇప్పుడు బయట నడుస్తున్నాయ్‌. వీటన్నింటినీ కంట్రోల్‌ చేయడం కష్టం. ఒక ప్రక్కన సేమ్‌ సాయంత్రం.. అశ్వినీ దత్‌ కూతురు ప్రియాంక దత్‌ - దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ల పెళ్లి రిసెప్షన్‌ కు విచ్చేసిన చరణ్‌-ఉపాసన - బన్నీ-స్నేహ, అల్లు అరవింద్‌.. వీళ్లందరూ ఒకసారి లోఫర్‌ కోసం వచ్చి హాయ్‌ చెప్పి వెళితే ఏమయ్యేది?

ఇదంతా ఒకెత్తయితే.. ఇదే ఫంక్షన్‌ కు ప్రభాస్‌ ను పిలిచి.. అతనేదో మాట్లాడుతుంటే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు రచ్చ చేయడం అనేది ఇంకా పెద్ద మిస్టేక్‌. ఈ దెబ్బకు వేరే హీరోలు ఎవరైనా ఎప్పుడైనా మెగా హీరోల ఫంక్షన్‌ కు రావాలంటేనే భయపడిపోయే ఛాన్సుంది. తిరుపతి గుడికి వెళ్లాలంటే అన్యమతస్తులు ఎలాగైతే డిక్లరేషన్‌ ఇవ్వాలో.. మెగా ఫంక్షన్లకు వెళ్లాలంటే హీరోలెవరైనా పవన్‌ నామ స్మరణ్‌ చేసి వెళ్లాల్సిందేనా అంటూ ఇప్పటికే సెటైర్లు పడుతున్నాయి.