Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ యాడ్స్ వద్దంటున్న స్టార్లు!

By:  Tupaki Desk   |   23 Dec 2018 5:30 PM GMT
ఫ్యామిలీ యాడ్స్ వద్దంటున్న స్టార్లు!
X
సినిమాల్లో ఎంత సంపాదన ఉన్నా యాడ్స్ లో చేస్తే వచ్చే అదనపు సొమ్ము ఇచ్చే కిక్కే వేరు. తక్కువ సమయం ఎక్కువ మొత్తం ప్రాతిపదికన దాదాపు స్టార్లందరూ ఏదో ఒకరు రూపంలో వీటిని వాడుకుంటున్న వాళ్ళే. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మొదలుకుని లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ దాకా అందరు ఏదో ఒక బ్రాండ్ లో భాగస్వామ్యులుగా ఉంటున్నారు. అయితే సోలోగా చేయడం కామనే కానీ సెలబ్రిటీలను వాళ్ళ లైఫ్ పార్టనర్ తో కలిపి యాడ్ లో భాగం చేయడం అనేది ఇప్పుడొస్తున్న న్యూ ట్రెండ్.

ఇటీవలే ఒక స్నానపు సబ్బు కోసం నాగ చైతన్య సమంతా కలిసి చేసిన యాడ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని అటు సోషల్ మీడియా ట్రెండ్స్ తో పాటు సేల్స్ కూడా స్పష్టం చేస్తున్నాయట. ఇది మనకు కొత్త అనిపించవచ్చు కానీ భార్యాభర్తలు జాయింట్ గా యాడ్స్ చేయడం అనేది బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే మనదగ్గర ఈ ట్రెండ్ అంత ఉదృతంగా కనిపించదు. వాస్తవానికి ఇటీవలే ఒక కార్పొరేట్ సంస్థ అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల జంటతో పాటు రామ్ చరణ్ ఉపాసన కపుల్ ని తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం నటించేందుకు మంచి ఆఫర్ ఇచ్చిందట. అయితే దాన్ని మొహమాటం లేకుండా ఇద్దరూ తిరస్కరించినట్టు సమాచారం.

వ్యక్తిగతంగా తాము ఎన్ని బ్రాండ్స్ లో నటించినా భార్యలను మాత్రం ఇందులో భాగం వహించేలా చేయడం ఇష్టం లేదని చెప్పినట్టు టాక్. ఉపాసన అపోలో గ్రూప్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ అవకాశం ఉన్నా సరే చరణ్ తో కలిసి వాళ్ళ ఉత్పత్తులను ప్రమోట్ చేసే ఛాన్స్ ని వాడుకోలేదు. అలాంటిది బయటి వాళ్లకు ఒప్పుకుంటారా. అల్లు అర్జున్ సైతం ఇదే అభిప్రాయంతో స్నేహతో కలిసి యాడ్ చేయమనే ప్రతిపాదనను తిరస్కరించినట్టు వినికిడి. అయినా ఇందులో ఎవరు రైట్ ఎవరు కాదు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎవరి ఛాయస్ వారిది.