Begin typing your search above and press return to search.
క్రియేటివ్ డైరెక్టర్ శిష్యుడికి ఓకే చెప్పిన మెగా హీరో
By: Tupaki Desk | 6 Dec 2020 9:51 AM ISTమెగా హీరో సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సోబెటర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. థియేటర్లకు జనాలు క్యూ కట్టారు.. మళ్లీ బాక్సాఫీస్ కళకళలాడుతుంది అనిపించినప్పుడు ఈ సినిమాను విడుదల చేయాలని తేజూ వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో తేజ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒక సినిమాకు దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సమయంలోనే తేజూ మరో కొత్త దర్శకుడితో సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అతి త్వరలోనే ప్రారంభం కూడా కాబోతుంది.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ వద్ద సుదీర్ఘ కాలం పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన రామ్ కు తేజ్ ఓకే చెప్పాడట. రామ్ తో తేజ్ కు చాలా కాలంగా పరిచయం ఉంది. ఆ పరిచయంతో లాక్ డౌన్ టైమ్ లో తేజ్ కు రామ్ కథ వినిపించడం ఆ కథ నచ్చడంతో తేజ్ వెంటనే ఓకే చెప్పడం జరిగిందట. ప్రస్తుతం తేజ్ కు గ్యాప్ ఉంది కనుక వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నారట. రామ్ దర్శకత్వంలో తేజ్ నటించబోతున్న సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్థం ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందట. అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.