Begin typing your search above and press return to search.

తమ్ముడు మీద ఉన్న ప్రేమను ఇలా చూపించిన మెగా హీరో

By:  Tupaki Desk   |   13 Jan 2022 9:15 AM GMT
తమ్ముడు మీద ఉన్న ప్రేమను ఇలా చూపించిన మెగా హీరో
X
మెగా బ్రదర్స్ మేనల్లుళ్ళు అయినా వైష్ణవ తేజ్ మరియు సాయిధరమ్ తేజ్ లు హీరోలుగా ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. వీరిద్దరు కూడా మెగా అభిమానుల మన్ననలు, అభిమానాన్ని దక్కించుకున్నారు. ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరోగా వైష్ణవ్ తేజ్ పేరు దక్కించుకున్నాడు. రెండవ సినిమా కొండపొలం సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవ తేజ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అన్నయ్య సాయి ధరంతేజ్ సోషల్ మీడియా లో ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశాడు. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ తన తమ్ముడు అయినందుకు లక్కీ అన్నట్లుగా సాయి ధరంతేజ్ పేర్కొన్నాడు. మై డియర్ విష్ణు బాబు అంటూ తన పోస్ట్ ని ప్రారంభించాడు.

గత సంవత్సరం మన ఫ్యామిలీ కి ఒక అద్భుతమైన సక్సెస్ నీ ద్వారా దక్కింది. నీవు హీరోగా పరిచయం అవ్వడం మంచి విజయాన్ని దక్కించుకోవడం మా అందరికీ సంతోషాన్ని కలిగించింది. అయితే సంవత్సరం చివర్లో కలిగిన ఒక చిన్న విషాదం సమయంలో నీవు కుటుంబానికి అండగా నిలవడం, ఆ సమయంలో నీవు చూపించిన బాధ్యత ప్రతి ఒక్కరిని మెప్పించింది. నేను హాస్పిటల్ లో ఉన్న సమయంలో నీవు చూపిన బాధ్యత ఎప్పటికీ మర్చిపోలేను. నీకు అన్నయ్య అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో నీ కళ్ళల్లో ఆనందం చూశాను అంటూ వైష్ణవి తేజ్ కు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియ జేశాడు. ఇక వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తమిళ అర్జున్ రెడ్డి దర్శకుడు గిరీశయ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఇక సాయి ధరంతేజ్ ఇప్పుడిప్పుడే యాక్సిడెంట్ నుండి బయట పడుకున్నాడు. అతి త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మూడు సినిమాలను సాయి ధరంతేజ్ ఇప్పటికే లైన్ లో పెట్టాడు. అందుకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాదిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉండగా.. ఇదే ఏడాది చివర్లో ఆ సినిమాల్లో ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా సాయి ధరమ్ తేజ్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ్ముడుతో అన్నకు ఉన్న ప్రేమను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఇలాగే ప్రేమ అనురాగం ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాము అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.