Begin typing your search above and press return to search.

విష్వక్ సేన్ ను మెచ్చేసుకున్న మెగా హీరో!

By:  Tupaki Desk   |   5 May 2022 11:30 AM GMT
విష్వక్ సేన్ ను మెచ్చేసుకున్న మెగా హీరో!
X
విష్వక్ సేన్ హీరోగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా రూపొందింది. ఈ సినిమాతో దర్శకుడిగా విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో విష్వక్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ అలరించనుంది. గ్రామీణ నేపథ్యంలో .. 'పెళ్లి చూపులు' అనే అంశం చుట్టూ తిరిగే కథ ఇది. జై క్రిష్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. బాపినీడు - సుధీర్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. రేపే విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ స్పందించాడు. ఈ సినిమా స్పెషల్ షోను తాను చూసినట్టుగా సాయిధరమ్ తేజ్ చెప్పలేదుగానీ, ఈ సినిమాలోని పాయింట్ తనకి బాగా కనెక్ట్ అయిందని చెప్పాడు. ఈ సినిమాలో ఎంటర్టైన్ మెంట్ .. ఎమోషన్స్ అన్నీ కూడా తనకి రిలేటెడ్ గా ఉన్నాయని అన్నాడు.

ఈ సినిమాలో అర్జున్ కుమార్ అల్లం పాత్రలోకి విష్వక్ మారిపోయిన తీరు చూసి తాను ఆశ్చర్యపోయాయని చెప్పాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేశాడు.

సాయిధరమ్ తేజ్ ఆ మధ్య రోడ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇటీవలె ఆయన పూర్తిగా కోలుకున్నాడు. తన తాజా చిత్రం షూటింగు కోసమని చాలా గ్యాప్ తరువాత కెమెరా ముందుకు వెళ్లాడు.

ఇక మిగతా యంగ్ హీరోల మాదిరిగానే వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు. ఒక వైపున తనకి సంబంధించిన పనులను చక్కబెడుతూనే, మరో వైపున విష్వక్ ను ఎంకరేజ్ చేయడానికి ఆయన ప్రయత్నించడం విశేషం.

ఇక విష్వక్ విషయానికి వస్తే పెర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమాలో తాను బెస్ట్ ఇచ్చానని చెప్పాడు. ఈ సినిమా తన కెరియర్ కి తప్పకుండా హెల్ప్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. 'దాస్ కా ధమ్కీ' .. 'ఓరి దేవుడా' సినిమాలు లైన్లో ఉన్నాయని అన్నాడు. కాలేజ్ నేపథ్యంలో 'స్టూడెంట్ జిందాబాద్' సినిమా రూపొందనుందనీ, ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడని చెప్పాడు. ఇక త్వరలో బాలీవుడ్ కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.