Begin typing your search above and press return to search.

భయపడుతున్న ఆ మెగా హీరో ఎవరు?

By:  Tupaki Desk   |   12 July 2017 5:15 AM GMT
భయపడుతున్న ఆ మెగా హీరో ఎవరు?
X
మెగా కాంపౌండ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, కొత్త వాడనే ఫిలింగ్ నుంచి తప్పించుకుంటూ ఓపినింగ్స్ తెచ్చుకుంటున్నాడు ఆ యంగ్ హీరో. అలానే రెగ్యూలర్ సినిమాలు కాకుండా కాస్త కొత్త కథల్ని ట్రై చేస్తున్నాడు. అయితే ఆ హీరోగారి ప్రయత్నాలేవి పెద్దగా వర్క్ అవుట్ అవ్వడం లేదు. ఇప్పటివరకు ఆ హీరో నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

మెన్న ఈ మధ్య వచ్చిన మూడో సినిమా అయితే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో తన నాలుగో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేశాడు ఆ లిటిల్ మెగా హీరో. కానీ ఆ అతి జాగ్రత్తే మరోసారి ఈ హీరోగారిని ముంచే పరిస్థితికి తెచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. పెద్ద బ్యానర్ లో సినిమా, తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్, కొత్త అమ్మాయి అయినా క్రేజ్ ఉన్న హీరోయిన్ ఇలా ప్రతి విషయంలో వెనకముందు చూసుకొని సినిమాకి సైన్ చేసిన ఆ హీరోగారు మళ్లీ కథని జడ్జ్ చేసే విషయంలో తప్పటడుగు వేశాడని తెలిసింది.

సినిమా ఎక్కడో తేడా కొడుందుదేమో అనే భయం రోజు రోజుకి ఆ హీరోగారికి ఎక్కువైపోతుందని సమాచారం. ఈ భయాన్ని తన సన్నిహితులు దగ్గర కూడా పలు మార్లు ఆ హీరోగారి బయటపెట్టినట్లుగా తెలిసింది. ఆన్ లైన్ ప్రమోషన్స్ పేరిట సినిమా ప్రచారం కూడా నత్తనడకన సాగడం ఆ హీరో గారికి రుచించడం లేదని, తనే స్వయంగా రంగంలోకి దిగి నిర్మాత పై ఒత్తిడి తెచ్చి ఓ భారీ ప్రమోషనల్ ఫంక్షన్ ఏర్పాటయ్యేలా చేశాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ హీరోగారి టెన్షన్ ఎప్పటికి తీరుదుందో చూడాలి.