Begin typing your search above and press return to search.

మెగా హీరో రిస్క్ చేస్తున్నాడా ?

By:  Tupaki Desk   |   12 March 2020 7:30 AM GMT
మెగా హీరో రిస్క్ చేస్తున్నాడా ?
X
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన కుర్ర హీరోల్లో సాయిధరం తేజ్ , వరుణ్ ఇద్దరూ సత్తా చాటుతూ ముందుకెళ్తున్న అందరికీ తెలిసిందే. అయితే స్క్రిప్ట్ సెలెక్షన్ లో డైరెక్టర్స్ విషయంలో తేజ్ కంటే వరుణ్ బెస్ట్ అని రుజువు చేసుకున్నాడు. అందుకే వరుణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ అంచనా ఉంటుంది. అయితే ప్రతి రోజు పండగే కంటే ముందు ఇలాగే రాంగ్ డిసిషన్స్ తో వరుస ఫ్లాప్స్ అందుకున్నాడు తేజ.

చిత్రలహరి నుండి మళ్ళీ ఊపందుకొని ప్రతి రోజు పండగే తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక నుంచైనా రైట్ డిసిషన్స్ తీసుకుంటాడనుకుంటే మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నాడు తేజ్. ప్రస్తుతం కొత్త కుర్రాడు సుబ్బు డైరెక్షన్ లో 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా చేస్తున్న మెగా హీరో నెక్స్ట్ దేవకట్టాతో సినిమా చేసేందుకు రేడీ అవుతున్నాడు.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. అయితే దేవకట్టా మంచి ఫిలిం మేకరే అందు లో సందేహమే లేదు. కానీ ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్థానం సినిమా కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. తాజాగా ప్రస్థానం సినిమాను హిందీలో తీసి అక్కడ కూడా ఫ్లాప్ అందుకున్నాడు. మరి ఈ టైంలో దేవకట్టా తో తేజ్ సినిమా అంటే రిస్కే అనిపిస్తుంది. మెగా హీరో ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడో ?