Begin typing your search above and press return to search.

టెన్షన్ తీరగానే లండన్ వెళ్తున్న మెగాహీరో

By:  Tupaki Desk   |   19 July 2017 4:41 AM GMT
టెన్షన్ తీరగానే లండన్ వెళ్తున్న మెగాహీరో
X
బ్యాడ్ టైమ్ ఉంటే బ్యాగ్రౌండ్ ఉన్నా ఎవ్వరు ఏం చేయలేరు, లిఫ్ట్ ఇచ్చేందుకు వరుసపెట్టి బడా ప్రొడ్యూసర్లు ప్రయత్నిస్తున్నా ఆ మెగా హీరోకి మాత్రం కాలం కలిసి రావడం లేదు. కొత్త రకమైన కథలు ఎంచుకుంటాడని పేరొస్తే ఏం లాభం - ఆ మెగా హీరోతో సినిమా తీస్తే డబ్బులు రావడం లేదని బిజినెస్ సర్కిల్స్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మెగా హీరో సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం పాపం ఒకే రూట్ లో వెళ్లే ఓ దర్శకుడు ఆ మెగా హీరో కోసం ఓ కమర్షీయల్ డైరెక్టర్ లా స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడని సినీజనాలు అంటున్నారు. సినిమా పక్కా హిట్ అవుతుంది, మాస్ ప్రేక్షకులకి ఏం కావాలో అన్ని ఈ సినిమాలో దొరుకుతాయనే కొత్త కొత్త మాటలు ఆ దర్శకుడు నోటి నుంచి రావడంతో అంతా షాక్ అవుతున్నారని టాక్.

అలానే ఆ మెగా హీరో కంటే హీరోయిన్ పైనే ఎక్కువ ఫోకస్ వచ్చింది. ఇవ్వని పక్కనపెడితే ఈ సినిమాని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ ప్రస్తుతం ఆ మెగా హీరోని వెంటాడుతుందని సమాచారం. దీంతో ఆ టెన్షన్ తీరగానే లండన్ వెళ్లేందుకు ఆ మెగా హీరో ఎర్పాట్లు చేసుకున్నాడని తెలిసింది. అయితే ఇంతకి ట్విస్ట్ ఏంటంటే ఆ మెగా హీరో లండన్ వెళ్లేది తన అప్ కమింగ్ మూవీ షూటింగ్ కోసమట - అడపదడప తళ్లుక్కుమంటున్న ఓ బబ్లీ బ్యూటీ ఆ మెగా హీరో సరసన నటించబోతుందని టాక్. మరి హై టెన్షన్ పడుతున్న ఆ మెగా హీరోకి ఫ్యాన్స్ ఎంత సపోర్ట్ చేస్తారో చూడాలి.