Begin typing your search above and press return to search.

మెగా హీరో వర్సెస్ మెగా హీరో

By:  Tupaki Desk   |   19 Aug 2017 7:06 AM GMT
మెగా హీరో వర్సెస్ మెగా హీరో
X
ఇప్పటివరకు సరైన సక్సెస్ ఒక్కటి కూడా ఆ మెగా హీరోకి రాక ఇటీవల హిట్ రావడంతో, ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం అతని వైపు తిరిగింది. అయితే ఈ హిట్ లో మొత్తం క్రెడిట్ అతగాడికి దగ్గకపోయినా, మెగా కాంపౌండ్ బ్రాండ్ నేమ్ ఆ యంగ్ హీరో పై ఉండటంతో పెద్ద నిర్మాతల అతని కాల్షీట్స్ కోసం క్యూ కడుతున్నారు. అయితే ఇటీవల మెగా కాంపౌండ్ లోని మీడియం రేంజ్ హీరోల మధ్య కోల్డ్ వార్ నెలకొందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ కొత్తగా సక్సెస్ వచ్చిన హీరో పై మిగతా హీరోలు కాస్త గుర్రుగా ఉన్నారని తెలిసింది. ఈ సెగ స్టార్ రేంజ్ లో ఉన్న యంగ్ మెగా హీరోలకి కూడా తాకిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆ మెగా హీరో తాజాగా హిట్ కొట్టిన సినిమా నైజాం ఏరియాలో చాలా బాగా ఆడుతుంది.

సినిమా రిలీజై మూడు వారాలు పైనే అయినప్పటికి కలెక్షన్లు ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఈ చిత్ర నిర్మాతలు మరో మెగా హీరోతో ఇటీవలే సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు. దీంతో ఫ్లాప్ వచ్చిన ఆ స్టార్ మెగా హీరో కంటే హిట్ వచ్చిన కొత్త మెగా హీరో బెటర్ అనే కామెంట్స్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ ఆ స్టార్ మెగా హీరోకి కూడా చేరడంతో అసలు గొడవ మొదలైందని సమాచారం. అయితే ఆ కుర్ర మెగా హీరో మాత్రం ఇవేమి పట్టించుకోకుండా హ్యాపీగా తన నెక్ట్స్ సినిమా షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లే ప్లానింగ్ లో ఉన్నాడని తెలిసింది. చేయబోయే కొత్త సినిమాతో కూడా తన సీనియర్లు చెక్ పెట్టేలానే కసిలో ఆ మెగా హీరో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఒక్క హిట్ తోనే మెగా కాంపౌండ్ లో మిగతా హీరోలకి చెమటలు పట్టిస్తున్న ఆ కుర్ర హీరోకి మరో హిట్ చాలా కీలకం. మరి మరో సక్సెస్ ఆ యంగ్ హీరోకి దక్కుతుందో లేదో చూడాలి.