Begin typing your search above and press return to search.

మెగా హీరో డెబ్యూ సినిమా.. హైప్ ఏది?

By:  Tupaki Desk   |   15 Nov 2019 8:11 AM GMT
మెగా హీరో డెబ్యూ సినిమా.. హైప్ ఏది?
X
మెగా ఫ్యామిలీలో ఎందరు హీరోలున్నా సరే.. ఓ కొత్త హీరో వస్తున్నాడంటే ఆ హైప్ మామూలుగా ఉండదు. మెగా ఫ్యాన్ బేస్.. ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండడంతో కొత్తగా వచ్చే మెగా హీరోలకు సక్సెస్ రేట్ ఎక్కువే. అందుకే కొత్త మెగా హీరో వస్తున్నాడంటే అటు ఇండస్ట్రీ వర్గాలు.. ఇటు సాధారణ ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తారు. మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా రాబోతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ఉప్పెన' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో సినిమా ఈ లాంచ్ జరిగింది. షూటింగ్ మొదలు పెట్టి కూడా చాలా నెలలే అయింది. అయితే ఈ సినిమా గురించి పెద్ద గా హడావుడి కనిపించడం లేదు. సినిమా షూటింగ్ అప్డేట్స్ పెద్దగా రావడం లేదు. ఎక్కడ షూట్ జరుగుతోంది.. ఎప్పుడు సినిమా రిలీజ్ చేస్తున్నారు అనే విషయాలపై ప్రేక్షకులకు ఏమాత్రం సమాచారం లేదు. మొదట్లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్.. టైటిల్ పోస్టర్ తప్ప ఇప్పటి వరకూ ప్రమోషన్స్ ఏమీ జరగలేదు.

ఒక మెగా హీరో డెబ్యూ సినిమా ఇలా అప్డేట్స్ లేకుండా ఉండడం చాలామందికి అంతుచిక్కడం లేదు. ఇలాగే కొనసాగితే మాత్రం ఈ సినిమా రిలీజ్ సమయానికి హైప్ రావడం కష్టమనే విషయం మేకర్స్ అలోచించాలని కొందరు మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.