Begin typing your search above and press return to search.

ఎఫ్‌3 లో మెగా గెస్ట్‌ అప్పియరెన్స్‌

By:  Tupaki Desk   |   20 Jan 2021 9:44 AM GMT
ఎఫ్‌3 లో మెగా గెస్ట్‌ అప్పియరెన్స్‌
X
సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఎఫ్‌ 3 మూవీలో మూడవ హీరో ఉంటాడు అంటూ చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమద్య కథానుసారంగా మూడవ హీరో అవసరం లేదని ఇద్దరు హీరోలు మాత్రమే ఎఫ్‌ 3 లో కూడా నటించబోతున్నట్లుగా దర్శకుడు అనీల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. అయినా కూడా ఈ సినిమాలో మరో హీరో అంటూ మీడియాలో పదే పదే వార్తలు వచ్చాయి వస్తూనే ఉన్నాయి. మూడవ హీరో గా రవితేజ అంటూ మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మరో హీరో పేరు వినిపించింది. ఇప్పుడు సాయి ధరమ్‌ తేజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్‌ 3 సినిమాలో దాదాపుగా 15 నుండి 20 నిమిషాలు కనిపించే పాత్రలో చివర్లో సాయి ధరమ్‌ తేజ్‌ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అనీల్‌ రావిపూడి మరియు సాయి ధరమ్‌ తేజ్ ల మద్య మంచి సంబంధం ఉంది. కనుక అనీల్‌ అడిగితే ఖచ్చితంగా తేజ్ కాదనడు. కనుక ఎఫ్‌ 3 లో తేజ్‌ నటించడం ఖాయం అనిపిస్తుందని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ స్పీడ్ గా జరుగుతుంది. షూటింగ్‌ లో ఏ క్షణంలో అయినా తేజ్ జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ ఏడాది సమ్మర్‌ చివరి వరకు సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకుడు అనీల్ రావిపూడి ఉన్నాడు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా మరియు మెహ్రీన్‌ లు నటిస్తున్నారు.