Begin typing your search above and press return to search.

మెగా 'గాడ్‌ ఫాదర్‌' మరో అప్డేట్‌

By:  Tupaki Desk   |   18 Oct 2021 7:34 AM GMT
మెగా గాడ్‌ ఫాదర్‌ మరో అప్డేట్‌
X
మలయాళ సూపర్ స్టార్‌ మోహన్ లాల్ నటించిన లూసీఫర్ ను తెలుగు లో చిరంజీవి రీమేక్ చేస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఈ రీమేక్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. చిరంజీవి చేయికి జరిగిన చిన్న ఆపరేషన్ కారణంగా రెండు మూడు వారాల బ్రేక్ ను తీసుకున్నారు. ఈ సినిమాను తక్కువ సమయంలో షూట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఒరిజినల్ లొకేషన్స్‌ లో చిత్రీకరణ జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవికి తల్లి పాత్రలో గంగవ్వ నటించబోతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇంకా ఆ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సమయంలోనే సినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడు విజయ్‌ చందర్‌ ను ఎంపిక చేశారని తెలుస్తోంది.

విజయ్ చందర్ సుదీర్ఘ నటన అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి నటుడు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో సినిమా వెయిట్‌ ఖచ్చితంగా పెరగడం ఖాయం. సినిమాలో సీఎంగా ఆయన కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఉండేది కొద్ది సమయం అయినా కూడా సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి ఖుష్బు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఒరిజినల్ వర్షన్ లూసీఫర్ కు చాలా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నారట. మెయిన్‌ స్టోరీ లైన్ మాత్రమే తీసుకుని పాత్రలు మరియు స్క్రీన్‌ ప్లేను మెజార్టీ పార్ట్‌ మార్చి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే సమ్మర్ కు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ ను మాత్రం ఇదే ఏడాది చివరి వరకు ముగించాలనే పట్టుదలతో ఉన్నారు. చిరంజీవి కి జోడీగా ఈ సినిమా లో హీరోయిన్ కూడా ఉంటుందట. ఒరిజినల్ వర్షన్‌ లో హీరోయిన్‌ ఉండదు. ఒక పక్కా కమర్షియల్‌ మూవీగా లూసీఫర్ ను మార్చి గాడ్ ఫాదర్ గా రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆచార్యను విడుదల చేయబోతున్నారు.. మే లేదా అంతకు ముందే గాడ్ ఫాదర్ ను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట. ఇవే కాకుండా భోళా శంకర్‌ మూవీ కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.