Begin typing your search above and press return to search.

ఊటీలో మెగా 'గాడ్ ఫాదర్'

By:  Tupaki Desk   |   22 Sep 2021 8:30 AM GMT
ఊటీలో మెగా గాడ్ ఫాదర్
X
మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ''గాడ్ ఫాదర్''. ఇటీవలే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబడిన యాక్షన్ ప్యాక్డ్ టైటిల్ పోస్టర్ కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రంలో చిరు ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' చిత్రానికి తెలుగు రీమేక్ అయినప్పటికీ..ఒరిజినల్ స్టోరీలోని ప్లాట్ ను మాత్రమే తీసుకొని మెగాస్టార్ ఇమేజ్ కు తగినట్లుగా మార్పులు చేశారు. చిరంజీవి సినిమా అంటే మెగా అభిమానులు ఏమేమి ఆశిస్తారో అన్ని అంశాలు ఉండేలా దర్శకుడు ఈ హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను రెడీ చేస్తున్నారు.

'గాడ్‌ ఫాదర్' రెగ్యులర్ షూటింగ్ గత నెలలో హైదరాబాద్‌ లో చిరంజీవి పాల్గొన్న హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ తో ప్రారంభించబడింది. ఈ క్రమంలో న్యూ షెడ్యూల్ షూటింగ్ ఈరోజు ఊటీలో మొదలైందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ షెడ్యూల్‌ లో చిరంజీవి మరియు ఇతర ప్రధాన తారాగణం పై టాకీ పార్ట్ ను చిత్రీకరించనున్నారు.

కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. ఇది చిరంజీవి నటిస్తున్న 153వ సినిమా. దీనికి ఆర్బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.