Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : మెగా తండ్రి కొడుకుల ట్రిప్‌

By:  Tupaki Desk   |   22 Oct 2021 2:00 PM IST
ఫొటోటాక్‌ : మెగా తండ్రి కొడుకుల ట్రిప్‌
X
మెగా బ్రదర్‌ నాగబాబు మరియు ఆయన తనయుడు వరుణ్‌ తేజ్ చిన్న హాలీడే ట్రిప్‌ కు వెళ్లారు. ఆ సందర్బంగా తీసుకున్న ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వరుణ్‌ తేజ్‌ ఈ ఫొటోను డాడ్ తో చిన్న ట్రిప్ అంటూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్‌ చేయగా నాగబాబు కూడా ఈ ఫొటోను ఇన్ స్టా గ్రామ్‌ పోస్ట్‌ గా షేర్‌ చేశాడు. నీతో గడిపిన ఏ రోజు అయినా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటూ వరుణ్‌ తేజ్‌ ను ట్యాగ్‌ చేశాడు. ఈ వెకేషన్ చాలా స్పెషల్‌ గా అడ్వెంచర్ గా ఉండబోతుంది అంటూ నాగబాబు పేర్కొన్నాడు. తండ్రి కొడుకుల ఈ సెల్ఫీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవలే గని సినిమా చిత్రీకరణ ముగించుకున్న వరుణ్‌ తేజ్‌ ఇలా చిన్న వెకేషన్‌ ను ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

నాగబాబు షేర్‌ చేసిన ఫొటోకు నిహారిక కామెంట్‌ చేసింది. నేను లేకుండా వెకేషన్‌.. నన్ను మిస్ అవ్వండి అంటూ సరదాగా వ్యాఖ్యనించింది. మెగా బ్రదర్‌ తన చిన్న ఫ్యామిలీతో సరదా హాలీడేను ఎంజాయ్‌ చేస్తున్నాడు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్‌ లో ఈ ఫొటో నిలిచింది. నాగబాబు యూట్యూబ్‌ వెబ్‌ సిరీస్‌.. ఇతర షో లు ఇంకా ఇతర కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ సమయంలో కొడుకు తో కలిసి హాలీడే బ్రేక్ తీసుకున్నాడు. మా ఎన్నికల సమయంలో నాగబాబు చేసిన హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక వరుణ్‌ తేజ్‌ సినిమా గురించి చెప్పాలంటే కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో సిద్దు మరియు అల్లు బాబీలు కలిసి నిర్మిస్తున్న గని సినిమా లో నటిస్తున్నడు. సినిమా చిత్రీకరణ ముగించారు. అతి త్వరలోనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను కూడా ముగించి సినిమాను విడుదల కు సిద్దం చేయబోతున్నారు. సినిమా విడుదల తేదీ పై అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఎఫ్‌ 3 సినిమా విడుదల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో వెంకటేష్ తో కలిసి వరుణ్‌ తేజ్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఎఫ్‌ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది కనుక ఎఫ్‌ 3 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కాకుండా వరుణ్‌ రెండు కొత్త సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు. త్వరలో ఆ సినిమాలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.