Begin typing your search above and press return to search.
థియేటర్ స్టాఫ్ కి అండగా ఉంటామంటున్న మెగా ఫ్యాన్స్...!
By: Tupaki Desk | 1 July 2020 5:00 PM ISTఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అంటే అభిమానులకు పండుగ రోజు. ప్రతి ఏడాది మెగాస్టార్ బర్త్ డే నాడు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సెలబ్రేషన్స్ చేయడానికి ఫ్యాన్స్ ఇప్పటి నుండే ప్రణాళికలు మొదలు పెట్టారు. కాకపోతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన నష్టపోయిన వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి అభిమాన సంఘం మెగాస్టార్ పుట్టినరోజు జరపాలని నిర్ణయించింది. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతి ఏడాది మెగా హీరోల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా చిరంజీవి పుట్టినరోజు నాడు అనేక సేవాకార్యక్రమాలు చేసి.. పేదలను ఆదుకొనే ఈ అభిమాన సంఘ సభ్యులు.. ఈ ఏడాది థియేటర్స్ కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించారట. మూడున్నర నెలలుగా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతబడిన విషయం తెలిసిందే. షూటింగులు ఆగిపోయాయి. థియేటర్స్ క్లోజ్ అయిపోయాయి. దీంతో చిత్ర పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్ట్స్ లాంటి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో ఈ అభిమాన సంఘం వారు చిరు బర్త్ డే ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ కార్మికులను ఆదుకోవాలని నిర్ణయిచుకున్నారు. చిరంజీవి నడిచిన బాటలో నడుస్తామంటూ ఈ మేరకు వారు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.