Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 8 .. మెగా సీక్రెట్ కనిపెట్టేసాం..

By:  Tupaki Desk   |   7 April 2020 12:00 PM IST
ఏప్రిల్ 8 .. మెగా సీక్రెట్ కనిపెట్టేసాం..
X
2019 ఉగాది నుంచి 2020 ఉగాది నాటికి.. స‌రిగ్గా ఏడాది అయ్యింది చిరు ట్విట్ట‌ర్ లో ప్ర‌వేశించి. ఇన్నాళ్ల‌లో ఆయ‌న ట్వీట్ల‌కు మెగాభిమానుల నుంచి స్పంద‌న ఆక‌ట్టుకుంది. అయితే ఇటీవ‌ల సీసీసీ (క‌రోనా క్రైసిస్ చారిటీ)ని ప్రారంభించి సినీకార్మికుల నిత్యావ‌స‌ర వెత‌ల్ని తీర్చేందుకు చిరు న‌డుం క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత కాలంగా టాలీవుడ్ లో ఏ స‌మ‌స్య ఉన్నా స్పందిస్తున్న చిరంజీవి ఆర్టిస్టులు స‌హా సినిమా 24 శాఖ‌ల్లో ఎలాంటి స‌మ‌స్య ఉన్నా తాను ముందుకు వ‌చ్చి ప‌రిష్క‌రిస్తూ అంద‌రిలో ఉత్సాహం నింపారు. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి త‌ర్వాత తాను ఉన్నాన‌ని నిరూపిస్తున్నారు. ఈలోగానే క‌రోనా క్రైసిస్ చుట్టుముట్ట‌డంతో ఒక టీమ్ ని అప్ర‌మ‌త్తం చేసి చారిటీ యాక్టివిటీ చేస్తున్నారు.

ఈలోగానే స‌డెన్ గా ఆయ‌న ఉగాది త‌ర్వాత ఓ ట్వీట్ వేశారు. నిన్న‌టికి నిన్న ఆయ‌న వేసిన ఈ ట్వీట్ మెగా ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ ఏమిటా ట్వీట్? అంటే.. ``#8thApril ...... ...ఈ తారీఖుతో నాకు బోల్డంత అనుబంధం ఉంది ... ... ... (సశేషం)......to be continued``.. అన్న‌దే ఆ ట్వీట్. అప్ప‌టినుంచి అస‌లింత‌కీ ఏప్రిల్ 8 సీక్రెట్ ఏమై ఉంటుంది? అంటూ ఫ్యాన్స్ ఒక‌టే ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు.

అయితే సోష‌ల్ మీడియాల్లో ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగిస్తున్నారు. అస‌లింత‌కీ ఆరోజు ప్ర‌త్యేక‌త ఏమిటా? అని ఆరా తీస్తే ఏప్రిల్ 8న ఏకంగా నాలుగైదు విశేషాలున్నాయి. అందులో మొత్తం ముగ్గురు సెల‌బ్రిటీ కిడ్స్ బ‌ర్త్ డేలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మేన‌ల్లుడు బ‌న్ని బ‌ర్త్ డే.. త‌మ్ముడు ప‌వ‌న్ వార‌సుడు అకీరా నంద‌న్ బ‌ర్త్ డే... త‌న ఫ్రెండ్ నాగార్జున వార‌సుడు అఖిల్ బ‌ర్త్ డే... వీటికి తోడు ఏప్రిల్ 8న ఆంజ‌నేయ జ‌యంతి. అంటే మెగాస్టార్ చిరంజీవి ఎంత‌గానో అభిమానించే అంజ‌నీ పుత్రుడు ఆంజ‌నేయుడి బ‌ర్త్ డే. అందువ‌ల్ల ఇది త‌న‌కు ఎంతో స్పెష‌ల్ అన్న‌మాట‌. ఆంజ‌నేయుడు స‌హా బ‌న్ని-అకీరా-అఖిల్ బృందానికి చిరు ప్ర‌త్యేకించి విషెస్ తెలియ‌జేయ‌నున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ సంద‌ర్భంగా మెగా ట్విస్ట్ ఏం ఉంటుంది? అకీరా నంద‌న్ డెబ్యూ మూవీ గురించి కానీ.. అఖిల్ న‌టిస్తున్న 4వ సినిమా అప్ డేట్ కానీ ఏదైనా చెబుతారా? అలాగే మేన‌ల్లుడు బ‌న్ని సినిమా టైటిల్ పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్నాయి కాబ‌ట్టి.. ఆ టైటిల్ ఏదో తానే లీక్ (ఆచార్య త‌రహాలో) చేస్తారా? అన్న‌ది కాస్త‌ చూడాలి.