Begin typing your search above and press return to search.

'వి' ని ఆ ఒక్క విషయంలో నెత్తికి ఎత్తుకున్న మెగా ఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   5 Sep 2020 4:30 PM GMT
వి ని ఆ ఒక్క విషయంలో నెత్తికి ఎత్తుకున్న మెగా ఫ్యాన్స్‌
X
నాని.. సుధీర్‌ బాబుల 'వి' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చింది. నాని 25వ సినిమా అవ్వడంతో చాలా అంచనాలు పెట్టుకున్నారు. పైగా నాని ఈ సినిమాలో నెగటివ్‌ రోల్‌ పోషిస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. చిత్ర యూనిట్‌ సభ్యులు నెగటివ్‌ షేడ్స్‌ అంటూ ప్రచారం చేయడంతో ఏకంగా నానిని విలన్‌ గా చూడబోతున్నాం అని అంతా అనుకున్నారు. కాని అందరిని నిరుత్సాహ పర్చాడు దర్శకుడు ఇంద్రగంటి. కాని ఒక్క విషయంలో మాత్రం ఆయన్ను మెచ్చుకుంటున్నారు.

'వి' సినిమాలోని ఒక సీన్‌ ముంబయిలో ఉంటుంది. ఆ సమయంలో జరిగే ఛేజింగ్‌ సీన్‌ లో సుధీర్‌ బాబు ఒక ఇంటి డోర్‌ ను హఠాత్తుగా ఓపెన్‌ చేస్తాడు. ఆ సమయంలో ఆ కుటుంబ సభ్యలు అంతా కూడా సెట్‌ మ్యాక్స్‌ లో 'డీజే' సినిమా హిందీ వర్షన్‌ ను చూస్తూ ఉంటారు. కొన్ని సెకన్ల పాటు బన్నీ కనిపిస్తాడు. అయినా కూడా మెగా ఫ్యాన్స్‌ దర్శకుడికి కృతజ్ఞతలు చెబుతున్నారు. బన్నీ హిందీ సినిమాలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ వర్షన్‌ లు యూట్యూబ్‌ మరియు శాటిలైట్‌ లో కూడా భారీగా వ్యూస్ ను రేటింగ్‌ ను కూడా దక్కించుకుంటూ ఉంటాయి.

హిందీలో బన్నీకి ఉన్న క్రేజ్‌ కు ఇది నిదర్శనం అంటూ బన్నీ ఫ్యాన్స్‌ బలంగా వాదిస్తున్నారు. 'వి' సినిమాను నిర్మించిన దిల్‌ రాజు 'డీజే' కు నిర్మాత. ఆ కారణంగా ఆ సీన్‌ ను పెట్టి ఉంటాడు అంటూ కొంరదు అంటూ ఉన్నా కూడా దిల్‌ రాజు డీజే కాకుండా ఇంకా ఇతర హీరోల సినిమాలు కూడా చాలా నిర్మించాడు. వాటిల్లో ఏదో ఒకదాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి 'వి' ఫలితంతో సంబంధం లేకుండా బన్నీ ఫ్యాన్స్‌ ఆ సీన్‌ స్ర్కీన్‌ షాట్‌ ను సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు. ఇంత క్రేజ్‌ ఉన్న బన్నీ 'పుష్ప'తో పూర్తి స్థాయి పాన్‌ ఇండియా హీరోగా మారడం ఖాయం అంటూ ఫ్యాన్స్‌ ఈ సమయంలో ఊహల్లో తేలిపోతున్నారు.