Begin typing your search above and press return to search.

అల్లు హీరోతో పోసాని.. మెగా ఫ్యాన్స్ అభ్యంతరం..!

By:  Tupaki Desk   |   1 Nov 2022 9:31 AM GMT
అల్లు హీరోతో పోసాని.. మెగా ఫ్యాన్స్ అభ్యంతరం..!
X
గత కొంతకాలంగా మెగా మరియు అల్లు అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఒకప్పుడు అందరినీ మెగా ఫ్యాన్స్ గా పేర్కొంటుండగా.. ఇప్పుడు మెగా వెర్సెస్ అల్లు అభిమానులు అనుకునే విధంగా కొందరు నెట్టింట రచ్చ చేస్తున్నారు.

ఓ సినిమా ఈవెంట్ లో 'చెప్పను బ్రదర్' అని అల్లు అర్జున్ అనడంపై మెగా అభిమానులు విరుచుకు పడిన సంగతి తెలిసిందే. దీనికి బన్నీ ఫ్యాన్స్ కూడా ధీటుగా బదులిచ్చారు. అప్పటి నుంచి ఏదొక విషయం మీద ఇరు వర్గాల మధ్య ఇంటర్నెట్ లో మాటల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.

'పుష్ప' విజయం తర్వాత మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పరోక్షంగా బన్నీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రెండు కుటుంబాలు పెరగడంతో ఇండస్ట్రీలో పోటీ ఎక్కువగా ఉందని.. ఇది ఆరోగ్యకరమైన పోటీ అని.. ఎవరికి వారు తమ గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నారని అల్లు అరవింద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీలో విబేధాలున్నాయనే రూమర్స్ ను ఖండించారు.

అయినప్పటికీ సోషల్ మీడియాలో మెగా vs అల్లు ఫ్యాన్ వార్స్ కి ఫుల్ స్టాప్ పడలేదు. తరచుగా ఏదొక అంశం మీద గొడవ పడుతూ వస్తున్నారు. ఇప్పుడు లేటెస్టుగా 'ఊర్వశివో రాక్షసివోలో' సినిమా కారణంగా అల్లు హీరోలపై మెగా అభిమానుల నుండి ఫిర్యాదులు వచ్చే పరిస్థితి ఏర్పడింది.

అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివోలో చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా మేకర్స్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. అయితే ఇందులో ఒక కీలక పాత్రలో దర్శక రచయిత, నటుడు పోసాని కృష్ణమురళిని తీసుకోవడంపై మెగా ఫ్యాన్స్ లోని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పోసాని గతంలో పవన్ కళ్యాణ్ మరియు అతని కుటుంబంపై అభ్యంతరకరమైన రెచ్చగొట్టే పదజాలాన్ని ఉపయోగించిన సంగతి తెలిసిందే. తన సతీమణిపై పీకే ఫ్యాన్స్ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ పోసాని ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు.

పవన్ కళ్యాణ్ నుం దూషించిన పోసాని కృష్ణ మురళిని అల్లు శిరీష్ సినిమాలో ఎలా తీసుకున్నారని ఓ మెగాభిమాని ప్రశ్నించారు. పోసాని ని సినిమాలో భాగం చేసిందనుకు కొందరు మెగా ఫ్యాన్స్ బాధ పడి ఉండొచ్చు కానీ.. ఇక్కడ హీరో లేదా మేకర్స్ ను తప్పుబట్టాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే 'ఊర్వశివో రాక్షసివోలో' సినిమా పాండమిక్ రాకముందే షూటింగ్ ప్రారంభించిందని అందరూ గమనించాలి. 'ప్రేమ కాదంట' అనే పేరుతో ఈ చిత్రాన్ని అప్పుడే దాదాపు పూర్తి చేసారు. పోసాని-పవన్ గొడవ జరిగే సమయానికే మూవీలో అతని పాత్ర చిత్రీకరణ పూర్తై పోయుండొచ్చు. లేదా సినిమా చివరి దశలో ఉండొచ్చు.

ఇప్పుడు పోసాని పాత్ర విషయంలో 'ఊర్వశివో రాక్షసివో' యూనిట్ చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటికే మహమ్మారి కారణంగా ఆలస్యమవడంతో నిర్మాతలపై ఎంతో కొంత అదనపు భారం పది ఉంటది. సినిమా ఫైనల్ స్టేజీకి వచ్చిన తర్వాత పోసాని ని తీసేసి మళ్ళీ రీషూట్ చేయడం అంటే కుదిరే పని కాదు.

కాబట్టి ఈ సమయంలో టీమ్ చేయగలిగింది ఏమీ లేదు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పోసాని కృష్ణ మురళి కనిపించలేదనే విషయం మెగా ఫ్యాన్స్ గమనించాలని అల్లు అభిమానులు కోరుతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో యూత్‌ ఫుల్‌ రొమాంటిక్ ఫన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా నవంబర్ 4న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.