Begin typing your search above and press return to search.

చాలు బాబు అంటున్న ఫ్యాన్స్!

By:  Tupaki Desk   |   5 Jan 2019 10:03 AM IST
చాలు బాబు అంటున్న ఫ్యాన్స్!
X
గత కొన్ని రోజులుగా ప్రత్యేకించి బాలకృష్ణను టార్గెట్ చేసిన నాగబాబు సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ మధ్య తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో బాలయ్య పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు అన్న దానికి రిటార్ట్ గా ఇప్పుడు నాగబాబు రివెంజ్ తీర్చుకోవడం కొందరు అభిమానులకు బాగానే ఉంది కాని ఇది నిజానికి మంచి కంటే ఎక్కువగా డ్యామేజ్ చేస్తోందన్నది నిజం. బ్లడ్ అండ్ బ్రీడ్ అంటూ ఒకసారి నిజాలు లేని బయోపిక్ ఎందుకని మరోసారి ఇలా గట్టి కౌంటర్లే వేసాడు నాగబాబు. కాని ఫ్యాన్స్ మాత్రం వీటిని ఆపెయల్సిందిగా కోరుతున్నారు. కారణం లేకపోలేదు.

ఎంత అన్నయ్య అయినా నాగబాబు జనసేన అధికారిక ప్రతినిది కాదు. పోనీ సభ్యత్వం తీసుకున్నాడా అంటే అదీ లేదు. వ్యక్తిగతంగా ఇతర వ్యవహారాల్లో పవన్ తరఫున మాట్లాడొచ్చు కాని ఇలా తమ్ముడు రాజకీయ పార్టీకి అద్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఎంతో కొంత ఇబ్బంది కలిగించేవే. సోషల్ మీడియా అసలే ఇప్పుడు కాక మీదుంది. టాపిక్ దొరకడం ఆలస్యం రెండు వర్గాలు తయారైపోయి మేమంటే మేము కరెక్ట్ అంటూ కొట్టేసుకోవడం కామన్ గా మారిపోయింది. ఈ నేపధ్యంలో కొన్ని టీవీ ఛానల్స్ దీన్ని అవకాశంగా తీసుకుని అప్పుడే డిబేట్లు పెట్టి ఈ నిప్పు ఇంకా మండించే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాయి.

నిన్న సాయంత్రం ఓ అప్ కమింగ్ న్యూస్ ఛానల్ లో దీని గురించి రెండు గంటల పాటు అర్ధరహిత చర్చ పెట్టడం ఆలోచించాల్సిన విషయమే. దీన్ని ప్రతిష్టగానో అవమానంగానో తీసుకుని ఫ్యాన్స్ తమ మనోభావాలను అనవసరంగా దెబ్బ తీసుకుంటారు. ఫైనల్ గా నష్టపోయేది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎటకారంగా చేసినా దాని పర్యవసానం ఎంత దూరం వెళ్తోందో నాగబాబు ఇప్పటికైనా అర్థం చేసుకుని వీటికి చెక్ పెడితే బెటర్.