Begin typing your search above and press return to search.

మెగా డాటర్ ఫోటోపై మెగా ఫ్యాన్స్ అభ్యంతరం..

By:  Tupaki Desk   |   9 Jan 2021 5:00 AM IST
మెగా డాటర్ ఫోటోపై మెగా ఫ్యాన్స్ అభ్యంతరం..
X
మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం ఇటీవల జొన్నలగడ్డ చైతన్యతో జరిగిన సంగతి తెలిసిందే. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఇటీవల మాల్దీవులను చుట్టి వచ్చారు. ఆ తర్వాత గోవాలో హనీమూన్ ని ఎంజాయ్ చేసి హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. నిహారిక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తమ ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో గోవాలో తీసుకున్న ఓ ఫోటోను నిహారిక ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది వైరల్ అయింది. ఇందులో నిహారిక జీన్స్ టాప్ ధరించి స్టన్నింగ్ లుక్ లో ఆదరగొట్టింది. అయితే నిహారిక సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఈ ఫోటోలని చూసిన కొందరు మెగా అభిమానులు నైతిక విలువల గురించి మాట్లాడుతూ కామెంట్స్ పెడుతున్నారు.

మెగా ఫ్యామిలీ హీరోలను అభిమానించే వారు వాళ్ళందరిని తమ కుటుంబ సభ్యులు వలె భావిస్తుంటారనే విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు మెగా డాటర్ పెళ్లి తర్వాత ఇలాంటి ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం నచ్చినట్లు లేదు. అందుకే నిహారిక ని ఆ ఫోటోలను డిలీట్ చేయాలని కోరారు. మరికొందరు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లైన అమ్మాయి తాళి మెడలో వేసుకోవాలని.. కానీ నిహారిక పోస్ట్ చేసిన ఫొటోలో మంగళసూత్రం లేకుండా ఉందని కామెంట్స్ పెట్టారు. అయితే కొద్దిసేపటికి నిహారిక ఇన్స్టాగ్రామ్ లో ఇతరులు కామెంట్ చేసే అవకాశం లేకుండా ఆ ఫోటోకి కామెంట్స్ సెక్షన్ ని హైడ్ చేసింది.

ఇదిలా ఉండగా నిహారిక పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగించాలని నిర్ణయించుకుంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ఓ ఫాంటసీ డ్రామా వెబ్‌ సిరీస్‌ లాంఛనంగా ప్రారంభమైంది. రాయుడు చిత్రాలు బ్యానర్‌ పై భాను రాయుడు దర్శక నిర్మాతగా ఈ సిరీస్‌ రూపొందనుంది. ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ - యూట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్ర ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.