Begin typing your search above and press return to search.

ట్విట్ట‌ర్లో మెగా ఫ్యాన్స్ వెర్స‌న్ ర‌ష్మి గౌత‌మ్

By:  Tupaki Desk   |   10 Dec 2016 1:30 PM GMT
ట్విట్ట‌ర్లో మెగా ఫ్యాన్స్ వెర్స‌న్ ర‌ష్మి గౌత‌మ్
X
త‌న ప్రమేయం లేకుండా ఓ వివాదంలో చిక్కుకుని మెగా అభిమానుల నుంచి దారుణ‌మైన కామెంట్లు ఎదుర్కొంది యాంక‌ర్.. యాక్ట్రెస్ ర‌ష్మి గౌత‌మ్. నిన్న రామ్ చ‌ర‌ణ్ సినిమా ‘ధృవ’ రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఎవ‌రో ఈ సినిమాను.. ‘గుంటూరు టాకీస్‌’ను పోలుస్తూ ట్విట్ట‌ర్లో ఒక మెసేజ్ పెట్టారు. అందులో ‘గుంటూరు టాకీస్ ఫ‌స్ట్ డే విజ‌య‌వాడ‌ క‌లెక్ష‌న్లు రూ.17 ల‌క్ష‌ల‌ని.. ‘ధృవ’ ఇక్క‌డ రూ.14 ల‌క్ష‌లే క‌లెక్ట్ చేసింద‌ని పేర్కొన్నారు. ఇది యాంటీ ఫ్యాన్స్ ప‌నే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఐతే దీన్ని లైట్ తీసుకోకుండా ఎవ‌రో చేసిందానికి ర‌ష్మి మీద ప‌డ్డారు మెగా ఫ్యాన్స్.

కొంద‌రు మెగా ఫ్యాన్స్ ర‌ష్మిని బూతులు తిట్టేస్తూ.. ఆమెను ట్యాగ్ చేస్తూ దారుణ‌మైన కామెంట్లు చేశారు. ఆమె క్యాస్ట్ గురించి కూడా మాట్లాడారు. దీంతో ర‌ష్మి హ‌ర్ట‌యింది. జోకుల్ని జోకుల్లా తీసుకోకుండా ఇలా హేట్ కామెంట్స్ పెట్ట‌డం ఏంట‌ని వాపోయింది. త‌న కులం గురించి కామెంట్లు చేసిన వాళ్ల‌ను ఉద్దేశించి.. మ‌నం ఏ కాలంలో ఉన్నాం అని ప్ర‌శ్నించింది. త‌న‌ను తిట్టి పోసిన కొంద‌రితో వ‌న్ టు వ‌న్ ఫైట్ కు దిగింది ర‌ష్మి. ఐతే ఓ మెగా అభిమాని.. ఈ వివాదానికి తెర దించాడు. మెగా అభిమానుల త‌ర‌ఫున సారీ చెప్పి.. ఈ వ్య‌వ‌హారాన్ని లైట్ తీసుకోమ‌న్నాడు. ఇంత‌కుముందు అన‌సూయ సైతం అల్లు అర్జున్ మీద కామెంట్లు చేసి వివాదంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే.