Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్ గిన్నిస్ రికార్డ్

By:  Tupaki Desk   |   4 Dec 2015 5:30 AM GMT
మెగా ఫ్యాన్స్ గిన్నిస్ రికార్డ్
X
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు సామాజిక సేవలోనూ ముందుంటారు. మెగా హీరోలు, మెగా ఫ్యాన్స్ అంతా ఈ విషయంలో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇప్పుడు చెన్నై మహానగరం భారీ వర్షాలతో బీభత్సానికి గురవుతుండడంతో.. ఇప్పటికే అల్లు అర్జున్ 25 లక్షలు - సాయిధరం తేజ్-వరుణ్ తేజ్ లు చెరో 3 లక్షలు సాయం ప్రకటించారు.

ఇలా సమాజానికి సేవ చేయడంలోనూ రికార్ట్ సృష్టించేందుకు మెగా ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాక.. అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. చిరు - పవన్ - చరణ్ - అల్లు అర్జున్ బర్త్ డే రోజుల్లో సామూహిక రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి, తమ అభిమానాన్ని సహృదయతను చాలాసార్లే చాటుకున్నారు.

ఈ సారి రామ్ చరణ్ బర్త్ డే నాడు, అంటే 2016 మార్చ్ 27న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఒకే రోజున 1,11,116 బ్లడ్ యూనిట్స్ సేకరించి, గిన్నిస్ రికార్డ్ సృష్టించి, చిరు పేరు మీద మరో తిరుగు లేని రికార్డ్ సాధించాలన్నది యోచనగా తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే.. ఈ రికార్డ్ ఒక లెక్కా... ఈజీగా సృష్టించేయడం ఖాయం.