Begin typing your search above and press return to search.

చిరంజీవిని అలా పిలిచి బుక్కైన అల్లు శిరీష్

By:  Tupaki Desk   |   20 April 2020 12:40 PM IST
చిరంజీవిని అలా పిలిచి బుక్కైన అల్లు శిరీష్
X
లాక్ డౌన్ వేళ అందరూ ఇంట్లో ఉండేసరికి ఆస్పత్రుల్లో రక్తం కొరత ఏర్పడింది. తలసీమియా - ఇతర వ్యాధుల వారికి రక్తం లేక అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో తాజాగా చిరంజీవి పిలుపునిచ్చాడు. అందరూ రక్తం దానం చేసి బాధితుల ప్రాణాలు కాపాడండని కోరాడు. అంతేకాదు.. స్వయంగా వెళ్లి రక్తదానం చేసి ఆ వీడియోను షేర్ చేసి ఈ పిలునిచ్చాడు.

చిరంజీవి పిలుపునకు స్పందించిన అల్లు హీరో శిరీష్.. ‘డన్ కేసీ గారు.. తప్పకుండా మేం తొందరగా రక్తదానం చేస్తాం’ అంటూ ట్విట్టర్ లో చిరంజీవి వీడియోను షేర్ చేసి అన్నాడు. ఇక్కడే వివాదం మొదలైంది..

ఎందుకంటే మామ వరుస అయిన చిరంజీవిని పట్టుకొని అల్లు శిరీష్ ‘కేసీ గారు’ అని పిలవడంపై మెగా ఫ్యాన్స్ భగ్గుమన్నారు. మంచిగా పిలువు అంటూ కొందరు.. ఒక్క హిట్ రాగానే ఎక్కువైందని మరికొందరు శిరీష్ పై కామెంట్ చేశారు. మెగాస్టార్ అని పిలువలేవా అని మండిపడ్డారు. కొద్దిరోజులుగా చిరంజీవి కుటుంబానికి - అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య జరుగుతున్న రచ్చను అంతా బయటకు తీసి అల్లు శిరీష్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

దీంతో దెబ్బకు దిగివచ్చిన అల్లు శిరీష్ తమ ఫ్యామిలీ సర్కిల్స్ లో చిరంజీవిని ‘కేసీ గారు’ లేదా కేసీ సర్ అంటామని అభిమానులకు వివరణ ఇచ్చారు. అంతేకాదు ఓ నమస్కారం పెట్టి ఈ చెలరేగిన వివాదాన్ని చల్లార్చారు. ఫ్యాన్స్ మాత్రం అల్లు శిరీష్ పదప్రయోగాన్ని వదలకుండా ట్విట్టర్ లో తిట్టేస్తున్నారు.