Begin typing your search above and press return to search.

థమన్ ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ హ్యాపీయే.. కానీ..!

By:  Tupaki Desk   |   8 Sep 2022 7:30 AM GMT
థమన్ ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ హ్యాపీయే.. కానీ..!
X
మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. భాషతో సంబంధం లేకుండా నిర్విరామంగా వర్క్ చేస్తున్నాడు. అయితే థమన్ 'అఖండ' 'భీమ్లా నాయక్' తర్వాత ఆ స్థాయిలో సంగీతం అందించలేకపోతున్నారనే కామెంట్స్ వస్తున్నాయి.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న భారీ చిత్రాల్లో 'గాడ్ ఫాదర్' మరియు RC15 ఉన్నాయి. ఇటీవల విడుదలైన 'గాడ్‌ ఫాదర్' టీజర్ కు థమన్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఫ్రెష్ గా అనిపించక పోవడంతో మెగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో 'గాడ్ ఫాదర్' సినిమాకు థమన్ సైడ్ నుంచి రీ-రికార్డింగ్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉందని.. అక్టోబర్ 5వ తేదీ నాటికి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వకపోవచ్చని.. అందుకే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వచ్చాయి.

ఈ నేపథ్యంలో థమన్ ట్విట్టర్ వేదికగా 'గాడ్ ఫాదర్' రూమర్స్ కు చెక్ పెట్టడమే కాదు.. RC15 మ్యూజికల్ అప్డేట్ అందించారు. ఈ రెండు చిత్రాల్లో భాగమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఓ ఫోటోని పోస్ట్ చేసాడు.

"ప్రియమైన సోదరుడు రామ్ చరణ్ #RC15 మరియు అక్టోబర్ 5న వస్తున్న మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' కోసం వర్క్ చేసిన అద్భుతమైన రోజు. లవ్ & పీస్" అని థమన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో మెగా అభిమానులను ఖుషీ చేశారు.

'గాడ్ ఫాదర్' రిలీజ్ డేట్ పై స్పష్టత ఇవ్వడమే కాదు.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RC15పై థమన్ అప్‌డేట్‌ ఇచ్చినందుకు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో రెండు సినిమాలకూ ఒకేసారి వర్క్ చేస్తే క్వాలిటీ అవుట్ పుట్ వస్తుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ హీరోగా షో మ్యాన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా RC15. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు 'ఆచార్య' వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమా 'గాడ్ ఫాదర్'.

ఈ రెండు మెగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నుంచి అభిమానులు అద్భుతమైన పాటలు మరియు ఆర్ ఆర్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒకేసారి రెండు ప్రాజెక్ట్‌ లలో పని చేయడం వల్ల బెస్ట్ మ్యూజిక్ వస్తుందో రాదో అని సందేహిస్తున్నారు.

అయితే ఇప్పుడు తమన్ 'గాడ్‌ ఫాదర్‌' మూవీకి సంబంధించిన రీరికార్డింగ్ పనులు ముగించుకుని.. రామ్ చరణ్‌ సినిమాకి షిఫ్ట్ అయ్యాడా? లేక ఏకకాలంలో రెండు భారీ ప్రాజెక్టులకు వర్క్ చేస్తున్నాడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.