Begin typing your search above and press return to search.
మెగా Vs అల్లు కాంపౌండ్ గా మారిందా?
By: Tupaki Desk | 19 March 2020 3:00 PM ISTటాలీవుడ్ లో మెగా కాంపౌండ్ చాలా పవర్ ఫుల్ అనే సంగతి అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలు.. స్టార్ ప్రొడ్యూసర్లు ఉండడంతో ఎప్పుడూ క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉంటాయి. ఇక మీడియం రేంజ్.. ఎంట్రీ లెవెల్ హీరోలు కూడా ఉండడంతో అన్ని రకాల కథలకు సూటయ్యే హీరోలు ఎవరో ఒకరు మెగా కాంపౌండ్ లో ఉంటారు. దీంతో దర్శకులకు నిర్మాతలకు మెగా కాంపౌండ్ అనేది ఫస్ట్ ఛాయిస్ గా ఉంటుంది.
ఇదిలా ఉంటే గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీ రెండు వర్గాలుగా ఉందనే గుసగుసలు వినినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీతో అల్లు వర్గానికి దూరం పెరిగిందని.. పైకి అలాంటిదేమీ లేదన్నట్టు కవర్ చేస్తున్నప్పటికీ లోపల మాత్రం రెండు వర్గాలు వేరే అన్నట్టుగా పరిస్థితి ఉందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించినప్పటికీ తర్వాత రెండవ సినిమా లేదా మూడవ సినిమా అయినా గీతా ఆర్ట్స్ వారికి ఇస్తారని అల్లు వారు ఆశించారట. అయితే ఇంత వరకూ ఆ అవకాశం రాలేదు. దీనిపై అల్లు ఫ్యామిలీ కొంత అసంతృప్తితో ఉన్నారట.
ఇదిలా ఉంటే ఈమధ్య అల్లు కాంపౌండ్ వారు మెగాస్టార్ సినిమా డేట్స్ అడిగితే అది తర్వాత చూద్దాం.. అంటూ జీఎ2 బ్యానర్ లో కళ్యాణ్ దేవ్ సినిమాను ఫిక్స్ చేశారట. కళ్యాణ్ దేవ్ కొత్త హీరో.. పైగా ప్రేక్షకుల్లో కళ్యాణ్ దేవ్ పై అంతగా ఆసక్తి లేకపోవడంతో అల్లు కాంపౌండ్ వారు ఈ ప్రాజెక్టును తమ మీద పెట్టడం పై కాస్త గుర్రుగా ఉన్నారట. ఇది అల్లు క్యాంప్ లో హాట్ టాపిక్ గా మారిందని.. అల్లు వర్గంలో ఉన్న నెక్స్ట్ జెనరేషన్ వారందరూ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాలు మెగా Vs అల్లు అన్నట్టుగా మారాయని చెప్పేందుకు సూచికలని అంటున్నారు.