Begin typing your search above and press return to search.

లొకేషన్లలో మెగా లేడీస్ భలే!!

By:  Tupaki Desk   |   19 March 2018 11:00 PM IST
లొకేషన్లలో మెగా లేడీస్ భలే!!
X
సినిమా షూటింగ్ సెట్స్ కు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లడం అప్పుడప్పుడూ జరిగేదే. హీరోయిన్స్ విషయంలో ఇలాంటివి బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆయా భామల అమ్మ.. నాన్న.. లేదా రిలెటివ్ ఎవరో ఒకరు కనిపించడం ఆనవాయితీ. ఇప్పుడీ ట్రెండ్ కొంత తగ్గింది కానీ.. ఇంకా పూర్తిగా మాయం కాలేదు. హీరోల షూటింగ్ స్పాట్స్ లో వారి కుటుంబ సభ్యులు కనిపించడం మాత్రం కాస్త అరుదైన విషయమే.

ఈ మధ్య కాలంలో మెగా హీరోల సినిమా షూటింగ్ జరిగే ప్రాంతాలకు.. వారి కుటుంబంలోని మహిళలు తరచుగా విజిట్ చేయడం కనిపిస్తోంది. తాజాగా అల్లు అర్జున్- స్నేహ జంటగా ఉన్న ఫోటో ఒకటి నెట్ లోకి వచ్చింది. ఈ పిక్ లో బన్నీ గెటప్ ను బట్టి చూస్తే.. పక్కాగా నాపేరు సూర్య సెట్ లో షూటింగ్ లో ఉన్నాడని అర్ధమవుతుంది. రామ్ చరణ్ షూటింగ్ జరిగే ప్రాంతానికి ఉపాసన కూడా తరచూ విజిట్ చేస్తూ ఉంటుంది. రంగస్థలం మూవీ షూట్ సమయంలో గోదారి తీరంలో చాలా సమయమే గడిపింది ఉపాసన. అలాగే బ్రూస్ లీ టీంలో అయితే బ్యాంకాక్ కూడా వెళ్లిపోయింది మెగా పవర్ స్టార్ వైఫ్.

సాయి ధరమ్ తేజ్ సినిమా షూటింగ్ అయితే.. వాళ్ల అమ్మ విజయదుర్గ అక్కడ ఎక్కువగానే కనిపిస్తుంది. ఈవెంట్స్ కు కూడా అమ్మను తోడు తెచ్చుకుంటాడు తేజు. వరుణ్ తేజ్ మూవీ షూటింగ్ స్పాట్స్ లో కూడా అతని అమ్మ పద్మజ కనిపిస్తూనే ఉంటుంది. ఇక సుశ్మిత ఇప్పటికే పలువురు మెగా హీరోలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా మారిపోయి షూటింగ్ లోనే ఉంటోంది. తన భర్త కళ్యాణ్ హీరో అవుతుండడంతో చిరు చిన్న కూతురు శ్రీజ కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేయవచ్చు.