Begin typing your search above and press return to search.
గర్ల్స్ తో మాట్లాడనుః వైష్ణవ్.. నేనైతే హీరోయిన్లతో కూడాః వరుణ్.. సీక్రెట్ విప్పిన నిహారిక!
By: Tupaki Desk | 14 Feb 2021 6:14 PM ISTమెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేస్తోంది. రెండు రోజుల్లోనే దాదాపు రూ. 16.21 కోట్ల షేర్, రూ. 25.80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటుతోంది. కాగా.. ఇన్నాళ్లూ ప్రమోషన్ కు దూరంగా ఉన్న మెగా ఫ్యామిలీ మెంబర్స్.. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంటరవుతున్నారు.
మెగా కజిన్స్ అంతా కలిసి నిర్వహించిన ఓ ఇంటర్వ్యూ.. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఈ కార్యక్రమంలో ‘ఉప్పెన' హీరో వైష్ణవ్ తేజ్‌తోపాటు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా డాటర్ నిహారిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు పర్సనల్ మేటర్లు సైతం డిస్కషన్ లో పెట్టారు.
ఈ సందర్భంగా.. ‘ఉప్పెన’ సినిమా సమయంలో ఫేస్ చేసిన ఇబ్బందులు.. పొందిన అనుభవాలు అన్నింటినీ షేర్ చేశాడు వైష్ణవ్. అయితే.. ఈ డిస్కషన్ మధ్యలో హీరోయిన్ కృతిశెట్టితో రొమాన్స్ గురించి ప్రశ్నించారు మిగిలిన ముగ్గురు. దీంతో.. చాలా సిగ్గుపడ్డాడు వైష్ణవ్. ‘నేను అసలు అమ్మాయిలతోనే మాట్లాడేవాడిని కాదు’ అని తేజూ అనగా.. వెంటనే అందుకున్న వరుణ్.. ‘అసలు నేను మూడు సినిమాల వరకు హీరోయిన్‌నే కలవలేదు’ అని సెటైర్ వేయడంతో నవ్వులు పూశాయి.
అయితే.. ఈ డిస్కషన్ లో మిగిలిన ముగ్గురు చెప్పిన విషయాలు ఒకెత్తయితే.. నిహారిక లీక్ చేసిన సీక్రెట్లు మరో ఎత్తు. ఇంటర్వ్యూలో భాగంగా నిహారిక అడిగిన ప్రశ్నకు.. మిగిలిన ముగ్గురు పేపరుపై ఆన్సర్ రాయాలి. ఈ క్రమంలో ‘మనందరిలో రెండు మూడు రోజుల పాటు స్నానం చేయకుండా ఉండే వాళ్ల పేరు చెప్పండి’ అని అడిగింది నిహారిక. దీంతో.. అందరూ వరుణ్ తేజ్ పేరు రాశారు. చివరకు వరుణ్ కూడా తన పేరే రాయడం విశేషం.
అయితే.. అలా ఎందుకు జరుగుతుందో కూడా చెప్పాడు వరుణ్. ‘నిహారిక బాత్రూంలోకి వెళ్లిందంటే గంటల కొద్ది లోపలే ఉండిపోతుంది. ఎంత పిలిచినా బయటకు రాదు. అందుకే నాకు స్నానం చేయడం కుదరదు’ అని చెప్పాడు వరుణ్. ఈ విధంగా మెగా కజిన్స్ ఇంటర్వ్యూ నవ్వులు పూయిస్తుండడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.