Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మెగా ఫ్రేమింగ్ అదుర్స్..

By:  Tupaki Desk   |   31 Oct 2016 12:15 PM GMT
ఫోటో స్టోరి: మెగా ఫ్రేమింగ్ అదుర్స్..
X
మెగాస్టార్ చిరంజీవి.. మెగా బ్రదర్ నాగబాబు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. సాయిధరం తేజ్.. అల్లు శిరీష్.. వరుణ్ తేజ్.. నీహారిక.. వైష్ణవ్ తేజ్(ఇంకా సినిమా ఎంట్రీ ఇవ్వలేదీ తేజు తమ్ముడు).. ఇంత మంది మెగా యాక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఈ ఫోటో అదిరిపోయింది కదూ.

దీపావళి సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒక చోటకు చేరాలని అనుకున్నపుడు.. సహజంగా అందరూ మెగాస్టార్ ఇంటికి వెళ్లడం ఆనవాయితీ. కానీ ఈ సారి మాత్రం వరుణ్ తేజ్ ఇంటి నుంచి కదల్లేని పరిస్థితి. మిస్టర్ షూటింగ్ లో ఉండగా యాక్సిడెంట్ జరగడంతో కాలికి పెద్ద గాయమే అయింది. అందుకే ఈసారి అంతా నాగబాబు ఇంటికే వచ్చేశారు. ఇలా మెగా ఫ్యామిలీలో ఉన్న నటులంతా మొత్తం అందరూ కలిసి ఓ గ్రూప్ ఫోటో దిగేశారు. యాజ్ యూజువల్ గా ఫ్యామిలీ ఈవెంట్స్ ను మిస్ చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ సారి కూడా ఈ ఫ్రేమ్ లో మిస్ అయిపోయాడు.

మొత్తంగా మెగా ఫ్రేమింగ్ అదిరిపోయింది కానీ.. రామ్ చరణ్-వరుణ్ తేజ్ లు ఇద్దరినీ ఓసారి క్లోజ్ గా గమనించడం.. చెర్రీ గట్టిగా పట్టుకుని వరుణ్ కూర్చుంటే.. వరుణ్ తేజ్ కాలికి ఉన్న కట్టుపై 'ఐ లవ్ ఆర్ సీ'(ఐ లవ్ రామ్ చరణ్) అని రాసిన లెటరింగ్.. వీరి అనుబంధాన్ని మరింతగా చెబుతోంది కదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/