Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఇది మెగా హాలోవీన్
By: Tupaki Desk | 27 Oct 2018 9:45 AM ISTవెస్ట్ లో ఎంతో వేడుకగా జరుపుకునే హాలోవీన్ పార్టీ కల్చర్ ఎప్పుడో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. గతంలో బాలీవుడ్ సెలబ్రిటీలు హాలోవీన్ వేడుకల్లో పాల్గొని దెయ్యం మాస్కులు.. రక్తం కారే మొహాల మేకప్పుతో సందడి చేసేవారు. మరి టాలీవుడ్ ఏమైన తక్కువా? మన దగ్గర దెయ్యాలు ఉండవా..? రక్త కాటేరు - కొరివి దెయ్యాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ తెలుగు రాష్టాల పల్లెలు. ఎవడిని కదిలించిన ఓ కొరివి దెయ్యం కథ చెబుతాడు!
అలాంటిది ఇప్పుడు మెగా ఫ్యామిలీ కి ఇవన్నీ తెలియని విషయాలు కాదు కదా అందుకే అతిభయంకరమైన గెటప్పులలో దెయ్యాలుగా మారిపోయారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గరనుండి అయన మనవరాలి వరకూ ఇదే తంతు. ఒక్క చరణ్ మాత్రం ఎక్సెప్షన్.. ఎందుకంటే అయన ఇప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్నాడు. అందుకే మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హారర్ సినిమాలో ని దెయ్యాలలాగా మారిపొతే చరణ్ మాత్రం స్వామి దుస్తులలో సాధారణంగా ఉన్నాడు. కానీ మెగా దెయ్యలతో పోజు మాత్రం ఇచ్చాడండోయ్.
చిరంజీవి..అల్లు అర్జున్.. స్నేహ.. సుష్మిత.. శ్రీజ.. కళ్యాణ్ దేవ్.. నిహారిక.. ఉపాసన లతో పాటుగా మెగా కిడ్స్ కూడా ఉన్నారు. ఇక మెగాస్టార్ గెటప్ మాత్రం అదిరిపోయిందంతే. సగం ఫేస్ మాత్రం స్కేరీ మేకప్ వేసుకుని రఫ్ఫాడించాడంతే. ఇలాంటి గెటప్ తో బాసు ఒక హారర్ సినిమా చేస్తే బాక్సులు బద్దలవ్వడం ఖాయమేమో...!