Begin typing your search above and press return to search.

మెగా బాస్.. మెగా ఫ్యామిలీ.. మెగా మెసేజ్

By:  Tupaki Desk   |   15 April 2020 1:00 PM IST
మెగా బాస్.. మెగా ఫ్యామిలీ.. మెగా మెసేజ్
X
మెగాస్టార్ చిరంజీవి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన సంగతి తెలిసిందే. అటు ట్విట్టర్ లోనూ.. ఇటు ఇన్ స్టాగ్రామ్ లోనూ రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇస్తూ ఈ తరం నెటిజన్లను.. ఆ తరం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. లాక్ డౌన్ సమయం కావడంతో కరోనాకు సంబంధించి ప్రజలలో అవగాహన పెంచే పోస్టులు కూడా పెడుతున్నారు. ఈరోజు అలాంటిదే ఒక పోస్టు తో మన ముందుకు వచ్చారు.

మెగాస్టార్ తన ఇన్ స్టా ఖాతా ద్వారా కాసేపటి క్రితం ఒక అద్భుతమైన ఫోటో పోస్ట్ చేశారు. ఇది నిజానికి ఒక సింగిల్ ఫోటో కాదు. చాలా ఫోటోలు కలిపి చేసిన కొలేజ్ లాంటిది. ఈ ఫోటోకు "మనందరం కలిసి కట్టుగా ఈ యుద్ధంలో విజయం సాధిద్దాం. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉందాం. మనల్ని.. మన వారి ని.. ఈ ప్రపంచాన్ని భద్రంగా ఉంచుదాం" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఫోటోలో మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కో ప్లకార్డు పట్టుకుని నిల్చున్నారు. ఒక్కొక్క ప్లకార్డులో ఒక్క పదం ఉంది. అందరి చేతుల్లో ఉన్న ప్లకార్డులను కలిపి ఒక వాక్యం లాగా చదివితే "ఇంట్లో ఉంటాం.. యుద్ధం చేస్తాం.. క్రిమిని కాదు ప్రేమని పంచుతాం.. కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం భారతీయులం ఒక్కటై భారత్ ని గెలిపిస్తాం" అనే ఒక అర్థవంతమైన సందేశం కనిపిస్తోంది.

ఈ మెగా మెసేజ్ లో చిరంజీవి.. అల్లు అరవింద్.. నాగబాబు.. వరుణ్ తేజ్.. చరణ్.. ఉపాసన.. శిరీష్.. నిహారిక.. సాయి ధరమ్ తేజ్.. వైష్ణవ్ తేజ్.. శ్రీజ.. కళ్యాణ్ దేవ్ లు ఉన్నారు. కలిసికట్టుగా ఉంటే మనం కరోనా పై విజయం సాధించగలం అంటూ మెగా కుటుంబం ఇచ్చిన ఈ మెసేజ్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన దక్కుతోంది. కొందరైతే ఈ మెగా మెసేజ్ లో పవర్ స్టార్ కూడా ఉంటే బాగుండేదని కామెంట్ చేశారు.