Begin typing your search above and press return to search.

మా ఎన్నికల మీద 'మెగా' ఎఫెక్ట్ ?

By:  Tupaki Desk   |   11 March 2019 4:33 AM GMT
మా ఎన్నికల మీద మెగా ఎఫెక్ట్ ?
X
రసవత్తరంగా జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో ఫైనల్ గా నరేష్ ప్రెసిడెంట్ గా ఎంపికవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది అధిక శాతం ఊహించిన ఫలితమే అయినప్పటికీ శివాజీరాజా టీమ్ లో కూడా బలమైన క్యాండిడేట్లు ఉండటంతో విజయం మీద ఎవరు ఖచ్చితమైన అంచనాకు రాలేకపోయారు. ఇకపోతే ఈసారి ఎన్నికల మీద మెగా కాంపౌండ్ ప్రభావం ఉందనేది ఫిలిం నగర్ ఉవాచ. దానికి కారణం లేకపోలేదు.

ఎన్నడూ లేనిది మూడు రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో నరేష్ వర్గానికి మద్దతు తెలిపి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.అదే మీటింగ్ లో జీవిత గుచ్చి గుచ్చి మా అందరికి పెద్ద చిరంజీవే అని ప్రత్యేకంగా చెప్పడం కూడా ఎవరి దృష్టిని దాటిపోలేదు. ఇదంతా మెగా ఫామిలీ సపోర్ట్ ఉందని ఇన్ డైరెక్ట్ గా చెప్పేందుకెనని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు చర్చించుకున్నారు. నాగబాబు నరేష్ కు అవకాశం ఇవ్వాల్సిందే అని చెప్పడం కూడా హై లైట్ అయ్యింది

గత ఏడాది శివాజీ రాజా నరేష్ ల వివాదం రేగి ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుని మీడియాకు ఎక్కినప్పుడు దీన్ని చల్లార్చింది చిరంజీవే అని ఆ సంఘటనలను ప్రత్యక్షంగా చూసినవారు చెబుతారు. నరేష్ నే ఓ మెట్టు దిగమని సూచించి ఇప్పుడు గొడవ చేసి లాభం లేదని మా ఎన్నికల్లో కాంటెస్ట్ చేసి అప్పుడు అందరూ నీవైపు ఉన్నారని రుజువు చేసుకోమని సలహా ఇచ్చినట్టుగా సదరు వార్తల తాలూకు సారాంశం.

అందుకే నరేష్ ఒక్క రోజులోనే కూల్ అయిపోయి శాంతి మంత్రం జపించేశాడు. కట్ చేస్తే ఇప్పుడు ఎన్నికలు జరగడం నరేష్ ఘన విజయం సాధించడం పక్కనే ఉన్న జీవిత రాజశేఖర్ లు సైతం గెలుపొందడం అన్ని అనూహ్యంగా జరిగిపోయాయి. సో ఎంతో కొంత మెగా ఎఫెక్ట్ అయితే మా ఎన్నికల్లో ఖచ్చితంగా ఉందనేది అధిక శాతం వ్యక్తమవుతున్న అభిప్రాయం