Begin typing your search above and press return to search.

మెగా డాట‌ర్ వ‌ర్సెస్ ఉగ్ర‌వాదం .. ఏంటీ ట్విస్టు?

By:  Tupaki Desk   |   20 Aug 2020 11:30 AM IST
మెగా డాట‌ర్ వ‌ర్సెస్ ఉగ్ర‌వాదం .. ఏంటీ ట్విస్టు?
X
తీవ్ర‌వాదం నేప‌థ్యం అంటేనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఎన్నో ఉగ్ర‌దాడులు ప్ర‌జ‌ల్ని భ‌యోత్పాతానికి గురి చేసిన‌వి ఉన్నాయి. అలాంటి నిజ‌ఘ‌ట‌న‌లనే క‌థాంశాలుగా ఎంచుకుని సినిమా.. వెబ్ సిరీస్ లు తీస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. క‌శ్మీర్ -మ‌నాలిలో తీవ్ర‌వాదం నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే క‌థాంశాన్ని ఎంచుకుని రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ని రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ లో బంప‌ర్ హిట్ సిరీస్ ఇది. తెలుగు వెర్ష‌న్ ని గొప్ప‌గానే ఎంజాయ్ చేశారు. ఈ సిరీస్ రెండో సీజ‌న్ స్ట్రీమింగుకి టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డింది. ఇందులో స‌మంత ఓ తీవ్ర‌వాదిగా కీల‌క పాత్ర పోషిస్తోంది.

ఫ్యామిలీ మ్యాన్ స్ఫూర్తితోనే ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో తెలుగులో ప‌లు వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయ‌ని స‌మాచారం. ఈ త‌ర‌హాలోనే మెగా డాట‌ర్ సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న వెబ్ సిరీస్ తెర‌కెక్క‌నుందా? అంటే అందుకు సంబంధించిన‌ ఆస‌క్తిక‌ర స‌మాచారం రివీలైంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగ‌స్టు 22)న ఆశ్చర్యం కలిగించే ఓ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌. 8-ఎపిసోడ్ ల‌తో రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఈ వెబ్-సిరీస్ ను హైద‌రాబాద్ అలైర్ స్పాట్ లో చిత్రీక‌రిస్తున్నార‌ని తెలిసింది. 2015 లో హైద‌రాబాద్ యాదాద్రి (యాద‌గిరి గుట్ట‌)లోని అలైర్ లో తెలంగాణ పోలీసులు అత్యంత‌ ప్ర‌మాద‌క‌ర‌ ఉగ్రవాది వికారుద్దీన్ అతని నలుగురు సహచరులను ఎన్ ‌కౌంటర్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నిజ‌ఘ‌ట‌న‌ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నార‌ని తెలుస్తోంది. ఆనంద్ రంగ దర్శకత్వంలో షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ప్రకాష్ రాజ్- సంపత్ రాజ్.. ఇతర ప్రముఖ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుష్మిత తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22 న సిరీస్ టైటిల్ ‌ను ప్రకటించాలని యోచిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది.