Begin typing your search above and press return to search.

పండ‌గ స్ప‌ష‌ల్: గ‌ణ‌ప‌య్య ఆశీస్సులు అందుకున్న మెగా దంప‌తులు

By:  Tupaki Desk   |   22 Aug 2020 5:00 PM IST
పండ‌గ స్ప‌ష‌ల్: గ‌ణ‌ప‌య్య ఆశీస్సులు అందుకున్న మెగా దంప‌తులు
X
బొజ్జ గ‌ణ‌ప‌య్య‌ను నిష్ఠ‌తో పూజించ‌డంలో సామాన్యులే కాదు.. సెల‌బ్రిటీలు ఎంతో శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తుంటారు. ఏడాది మొత్తం ఎలాంటి విఘ్నాలు క‌ల‌గ‌కుండా అనుకున్న‌వ‌న్నీ స‌వ్యంగా సాగాల‌ని గ‌ణ‌ప‌య్య ముందు మోక‌రిల్లి మ‌రీ మొక్కుతారు. విఘ్న వినాయ‌కుని ఆశీస్సుల‌తోనే నీలాప‌నింద‌లు త‌ప్పించుకోగ‌ల‌రు.

నేడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ హీరోలంతా వినాయ‌కుని పూజించి ఆశీస్సులు అందుకున్నారు. చిరంజీవి బ‌ర్త్ డే వినాయ‌క చ‌వితి ఒకేరోజు క‌లిసి రావ‌డం ఆస‌క్తిక‌రం. మెగా దంప‌తులు చిరంజీవి-సురేఖ‌.. రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న పూజా కార్య‌క్ర‌మం అనంత‌రం ఇదిగో ఇలా ఫోటో దిగారు.

అల్లు ఫ్యామిలీలోనూ వినాయ‌క చ‌వితి పూజా కార్య‌క్ర‌మాలు డీసెంట్ గా జ‌రిగాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి జంట వినాయ‌కుని ఆశీస్సులు అందుకున్నారు. ప్ర‌స్తుతం ఈ జంట ఫోటో అల్లు అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. ఇత‌ర మెగా హీరోలు ఎవ‌రికి వారు.. ఇళ్ల‌లో పూజ పున‌స్కారాలు కానిచ్చారు.