Begin typing your search above and press return to search.

మెగా క్యాంప్ వ‌ర్సెస్ అల్లు క్యాంప్?

By:  Tupaki Desk   |   21 Dec 2019 4:20 AM GMT
మెగా క్యాంప్ వ‌ర్సెస్ అల్లు క్యాంప్?
X
ఈ సంక్రాంతి పుంజుల మ‌ధ్య వార్ ప్ర‌త్య‌క్షం గా చూస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. పెద్ద పండ‌క్కి మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాలు నువ్వా నేనా అంటూ పోటీప‌డుతున్నాయి. అయితే ఈ పోటీలో ఇప్ప‌టికే త‌మ‌న్ అందించిన ఆడియో తో పాటు అల్లు అర్జున్ మార్కు యాక్ష‌న్ తో `అల వైకుంఠ‌పుములో` కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. దీన్ని ఎలాగైనా అధిగ‌మించాల‌ని.. అటెన్ష‌న్‌ని త‌మ వైపు మర‌ల్చుకోవాల‌ని `స‌రిలేరు నీకెవ్వ‌రు` టీమ్ ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే ఈ ప్ర‌య‌త్నాల్లో స‌క్సెస్ ఫుల్ గా ముందుకెళుతోంది స‌రిలేరు టీమ్. ఇప్పుడు ఏకంగా ప్రీరిలీజ్ కోసం మెగాస్టార్ నే రంగంలోకి దించేస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది.

జ‌న‌వ‌రి 5న ఎల్బీ స్టేడియంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రీరిలీజ్ వేడుక‌ని అత్యంత‌ భారీగా ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. స్వ‌యంగా రంగంలోకి దిగిన మ‌హేష్ చిరుని ఆహ్వానించిన‌ట్టుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ పెట్ట‌డం.. చిరు ఇంటికి వెళ్లి దిల్‌ రాజు- అనిల్ సుంక‌ర‌- ద‌ర్శ‌కుడు అనిల్ వెళ్లి ఆహ్వానించ‌డంతో చిరు కాద‌న‌లేక‌పోయార‌ట‌. మ‌హేష్ ఆడియో ఫంక్ష‌న్ కు చిరు రావ‌డం ఇదే తొలి సారి కావ‌డంతో ఇక్క‌డ చిరు ఏం మాట్లాడ‌తారా? అన్న ఆస‌క్తితో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే చిరు అల్లు క్యాంప్ హీరోకి స‌పోర్ట్ చేయ‌కుండా.. ఇలా ప్ర‌త్య‌ర్థి (పోటీ) క్యాంప్ ప్ర‌చారంలో పాల్గొన‌డంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించేందుకు రెడీ అవుతున్నార‌ట‌. ఇప్ప‌టికే దీనిపై సామాజిక వార్ మొద‌లైపోయింది కూడా.

మెగా ఫ్యామిలీ హీరో ఫంక్ష‌న్ ని కాద‌ని చిరు మ‌హేష్ ఫంక్ష‌న్ కి వెళ్ల‌డ‌మేమిటి? అంటూ సోష‌ల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్ ప్ర‌శ్నించ‌డం మొద‌లైంది. ఇక ప్రీరిలీజ్ లైవ్ జ‌రుగుతుడ‌గా లైవ్ చాట్ ర‌చ్చ‌కు దిగేందుకు రెడీ అవుతున్నార‌ట‌. పోటాపోటీగా ఘ‌ట్ట‌మ‌నేని హీరోతో పాటు.. మెగా హీరో సినిమా రిలీజ్ అవుతుంటే చిరు మాత్రం మ‌హేష్ సినిమా ప్ర‌మోష‌న్ చేయ‌డమేమిటి? అన్న ప్ర‌శ్న వేస్తున్నారు.

అస‌లింత‌కీ మెగా క్యాంప్ లో ఏం జ‌రుగుతోంది. అల్లు అర్జున్ ని మెగా హీరోలు దూరం పెడుతున్నారా? అంటూ ఓ సెక్ష‌న్ ప్ర‌శ్న లేవనెత్తింది. అయితే ఈ డౌట్ పై చిరు `స‌రిలేరు.. వేదిక నుంచి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల న‌డుమ స్నేహం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఒక‌రి కోసం ఒక‌రు అన్న‌ట్టుగానే ఉంది. సంక్రాంతి పందెం ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌ది. ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచే పోటీ మాత్ర‌మే. మ‌రి మెగా హీరో మెగా ఫంక్ష‌న్ కి వెళ్ల‌డం రొటీన్ అని ఆలోచించి మెగాస్టార్ ఇలా చేస్తున్నారా? అన్న‌ది కూడా స‌రిలేరు ప్రీఈవెంట్లో తేల్తుందేమో!!