Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్: మెగా బ్రదర్ డాషింగ్ లుక్!

By:  Tupaki Desk   |   1 Feb 2020 5:59 AM GMT
హాట్ టాపిక్: మెగా బ్రదర్ డాషింగ్ లుక్!
X
మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగువారికి ఇంట్రో ఇవ్వడం అంటే ఈటీవీ ప్రేక్షకులకు 'జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది.. మీరు తప్పక చూడాలి' అని రిక్వెస్ట్ చేసినట్టు. ఈ పోలిక పెద్దగా సెట్ అయినట్టు లేదు కదా..? అంతే ఈ జీవితంలో చాలా విషయాలు సెట్ కావు. అయినా సర్దుకుపోతూ ఉంటాము కానీ మార్చే ప్రయత్నం మాత్రం చెయ్యము. కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం అలా కాదు. ఆ ప్రయత్నం చేస్తారు. నాగబాబు గారి కొత్త లుక్ చూస్తే ఆ విషయం మనకు అర్థం అవుతుంది.

నాగబాబు ఈమధ్య స్లిమ్ గా ఫిట్ గా మారిపోయారు. కొన్ని నెలల క్రితం వరకూ కాస్త అధికబరువుతో నిండుగా కనిపించిన ఆయన ఇప్పుడు పూర్తిగా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. జబర్దస్త్ ను బైబై చెప్పి ఈమధ్యే జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమయ్యే 'అదిరింది' షో కు జడ్జిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. నాగబాబు టెలివిజన్ కెరీర్ లో వచ్చిన ఈ మార్పుతో పాటుగా ఇలా తన లుక్ లో కూడా మార్పు తీసుకురావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ వయసులో నాగబాబు ఇలా బరువు తగ్గి ఫిట్ గా మారడంతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

నాగబాబు రెడ్ కలర్ టీ-షర్టు ధరించిన ఫోటో చూస్తుంటే 'బ్రదర్ ఆఫ్ పవర్ స్టార్' అనిపిస్తున్నారని ఒక నెటిజన్ కామెంట్ చేయడం విశేషం. నాగబాబు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు కానీ ఇకపై తెలుగు సినిమాల్లో నాగబాబు కోసం ప్రత్యేకం గా బలమైన పాత్రలు డిజైన్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.