Begin typing your search above and press return to search.
ఇంట్రెస్టింగ్ గాసిప్: మెగా - అక్కినేని హీరోల మల్టీస్టారర్..!
By: Tupaki Desk | 4 July 2021 8:00 AM ISTటాలీవుడ్ లో ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాలు మళ్ళీ ఊపందుకున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు సెట్స్ పై ఉండగా.. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మెగా - అక్కినేని హీరోల మల్టీస్టారర్ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ఓ సినిమా చేయనున్నారని అంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. 'సంతోషం' 'మిస్టర్ పర్ఫెక్ట్' వంటి చిత్రాలతో మెప్పించిన దర్శకరచయిత దశరథ్.. 2016లో వచ్చిన 'శౌర్య' తర్వాత మరో సినిమాని డైరెక్ట్ చేయలేదు. అయితే రచయితగా ఓ వెబ్ సిరీస్ ని రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సిరీస్ రూపొందుతోది. ఈ క్రమంలో దశరథ్ ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ రెడీ చేశారట. ఈ కథ చైతూ - వరుణ్ తేజ్ లతో చేయాలని భావిస్తున్నారట. అంతేకాదు ఇందులో మరో కీలక పాత్ర కోసం పంజా వైష్ణవ్ తేజ్ ని అనుకుంటున్నారట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న అక్కినేని - మెగా ఫ్యామిలీ హీరోలు కలసి నటిస్తున్నారనే న్యూస్ ఆసక్తికరంగా ఉంది. గతంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి - నాగార్జున మల్టీస్టారర్ కు ప్రయత్నాలు జరిగి ఆగిపోయిన సంగతి తెలిసిందే.
ఇకపోతే 'మజిలీ' 'వెంకీమామ' సినిమాల సక్సెస్ తో జోష్ మీదున్న నాగచైతన్య.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు. అలానే విక్రమ్ కె.కుమార్ తో చైతూ చేస్తోన్న 'థాంక్యూ' మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరోవైపు 'ఎఫ్ 2' 'గడ్డలకొండ గణేష్' సినిమాలతో హిట్స్ అందుకున్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమా చేస్తున్నాడు. ఇదే క్రమంలో 'గని' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న చైతన్య - వరుణ్.. రాబోయే రోజుల్లో మల్టీస్టారర్ మూవీ చేస్తారేమో చూడాలి.